రూ.1కే షియోమీ రెడ్ మీ నోట్ 4 ఫోన్‌..!

0
Xiaomi selling its redmi note 4 phone for just 1 rupee

Xiaomi selling its redmi note 4 phone for just 1 rupee

షియోమీ రెడ్‌మీ నోట్ 4ను ఈ మ‌ధ్యే విడుద‌ల చేసిన విష‌యం విదిత‌మే. దీంట్లో యూజ‌ర్ల‌కు న‌చ్చిన అనేక ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ మార్కెట్‌లో రూ.11వేల ప్రారంభ ధ‌ర‌కు లభిస్తోంది. అయితే దీన్ని యూజ‌ర్లు కేవ‌లం రూ.1కే సొంతం చేసుకోవ‌చ్చు. అవును, మీరు వింటున్న‌ది నిజ‌మే. అయితే అందుకు ఓ చిన్న ప‌ని చేయాలి. అదేమిటంటే… షియోమీకి చెందిన ఎంఐ స్టోర్‌ యాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుని అందులో ఉండే మై ఫ్యాన్ ఫెస్టివ‌ల్ పేజీని ఓపెన్ చేయాలి. అందులో యూజ‌ర్లు రిజిస్ట‌ర్ చేసుకోవాలి. దీంతో వారు రెడ్ మీ నోట్ 4ను పొందేందుకు అర్హులు అవుతారు. ఈ క్రమంలో వారు రేపు జ‌ర‌గ‌నున్న షియోమీ ఫ్లాష్ సేల్‌లో పాల్గొనాల్సి ఉంటుంది.

Xiaomi Red Mi Note 4ఉద‌యం 10 గంట‌ల‌కు ప్రారంభ‌మ‌య్యే ఈ ఫ్లాష్ సేల్‌లో యూజ‌ర్లు రెడ్ మీ నోట్ 4 ఫోన్‌ను రూ.1కే కొనుగోలు చేయ‌వ‌చ్చు. అయితే ఆ ఫోన్లు కేవ‌లం 20 మాత్ర‌మే అందుబాటులో ఉంటాయి. అంటే ఎంత త్వ‌ర‌గా కొనుగోలు చేస్తే అంత త్వ‌ర‌గా ఫోన్ రూ.1కే ల‌భిస్తుంద‌న్న‌మాట‌. అయితే కేవలం ఈ ఫోన్ ను మాత్ర‌మే కాకుండా షియోమీ త‌న ఎంఐ బ్యాండ్‌ను, 10,000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల ప‌వ‌ర్ బ్యాంక్‌ను కూడా రూ.1కే అందిస్తోంది. వీటిని రేపు మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు జ‌ర‌గ‌నున్న ఫ్లాష్ సేల్‌లో కొనుగోలు చేయ‌వ‌చ్చు.

అయితే ఎంఐ బ్యాండ్లు కేవ‌లం 40 మాత్రమే సేల్‌కు పెట్ట‌గా, ప‌వర్ బ్యాంకులు 50 మాత్ర‌మే యూజ‌ర్ల‌కు ల‌భించ‌నున్నాయి.ఇవే కాకుండా ఎన్నో ఆఫ‌ర్ల‌ను కూడా షియోమీ అందిస్తోంది. వాటి గురించి తెలుసుకోవాలంటే షియోమీ ఎంఐ సైట్‌ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. ఇంకెందుకాల‌స్యం… మీకూ రూ.1కే షియోమీ ఫోన్ కావాల‌నుంటే వెంట‌నే పైన చెప్పిన విధంగా చేయండి..!

Share.

Comments are closed.