బ్రా సైజ్ క‌రెక్ట్‌గా లేక‌పోతే చాలా డేంజ‌ర‌ట‌.. ఎందుకంటే..?

0

women must wear correct size bras to avoid health problems

మ‌హిళ‌లకు బ్రా అనేది కేవ‌లం లో దుస్తులుగానే కాక, వారి శ‌రీర ఆకృతి కోసం కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది. అయితే ఛాతి, స్త‌నాల ఆకృతి వంటి అంశాల ఆధారంగా ఎవ‌రైనా మ‌హిళ‌లు క‌రెక్ట్ సైజ్ ఉన్న బ్రాల‌నే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేయ‌క‌పోతే ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. బ్రా సైజ్ కరెక్ట్ గా ఉంటే ఎలాంటి సమస్య ఉండదు. అదే క‌రెక్ట్‌గా లేక‌పోతే స్కిన్ రాషెస్ ఎదుర్కోక తప్పదు. ముఖ్యంగా స్ట్ర్రాప్స్ మీద నిర్లక్ష్యం చేస్తే ఇన్ఫెక్షన్స్ వ‌స్తాయి. చ‌ర్మంపై ద‌ద్దుర్లు వ‌చ్చి దుర‌ద‌గా ఉంటుంది.

2. బ్రా సైజ్ క‌రెక్ట్‌గా లేక‌పోతే దాని ప్ర‌భావం జీర్ణ వ్య‌వ‌స్థ‌పై కూడా ప‌డుతుంద‌ట‌. ఫ‌లితంగా అజీర్ణం, గ్యాస్ వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి.

3. లింఫాటిక్ నరాలు దెబ్బతింటాయి. లింఫాటిక్ నరాలు ఒత్తిడికి గుర‌యితే, శరీరంలో పేరుకుపోయే వ్య‌ర్థాలు బ‌య‌టికి వెళ్ల‌డం క‌ష్ట‌త‌ర‌మ‌వుతుంది.

women must wear correct size bras to avoid health problems

4. త‌ప్పు సైజ్‌లో ఉన్న బ్రా వేసుకునే మ‌హిళ‌ల‌కు ర‌క్త స‌ర‌ఫ‌రా స‌రిగ్గా జ‌ర‌గ‌ద‌ట‌. దీంతో బ్రెస్ట్ క్యాన్స‌ర్ వ‌చ్చేందుకు కూడా అవ‌కాశం ఉంటుంది.

5. బ్రా సైజ్ సరిగ్గా లేక‌పోతే అది మెడ, భుజాల‌పై ప్ర‌భావం చూపుతుంది. దీంతో ఆయా ప్ర‌దేశాల్లో నొప్పులు వ‌స్తాయి. వాపులు ఏర్ప‌డి విపరీత‌మైన బాధ క‌లుగుతుంది.

6. సరిగ్గా ఫిట్ కాని బ్రాల వ‌ల్ల శ్వాస కోశ స‌మ‌స్యలు వ‌స్తాయి. కొన్ని సంద‌ర్భాల్లో గాలి పీల్చుకునేందుకు కూడా క‌ష్ట‌త‌ర‌మ‌వుతుంది.

women must wear correct size bras to avoid health problems

7. బ్రాల‌ను మ‌రీ టైట్‌గా వేసుకోవ‌డం వ‌ల్ల జ్ఞాప‌క‌శ‌క్తి కూడా తక్కువ‌వుతుంద‌ని, మెద‌డు ఆరోగ్యంపై ప్ర‌భావం ప‌డుతుంద‌ని తాజాగా చేసిన ప‌రిశోధ‌న‌లు వెల్ల‌డిస్తున్నాయి.

Share.

Comments are closed.