మైలు రాళ్ల పై భాగంలో ఉండే రంగులు ఎప్పుడైనా చూశారా..? ఏ రంగుకి అర్ధం ఏంటో తెలుసా.?

0

why the milestones we see on indian roads are different in colourమనం ఏదైనా ప్రదేశానికి రహదారిపై వెళ్లేటప్పుడు మనకు దారి మధ్యలో రోడ్డు పక్కన అటు, ఇటు మైలు రాళ్లు కనిపిస్తాయి కదా. వాటితో మనం ఇంకా ఎంత దూరం వెళితే మన గమ్యస్థానం వస్తుందో, మనం ఏ ప్రాంతానికి దగ్గర్లో ఉన్నామో, దేనికి ఎంత దూరంలో ఉన్నామో ఇట్టే తెలిసిపోతుంది. దీంతో అన్ని కిలోమీటర్లకు అనుగుణంగా మనం వీలుంటే వేగం పెంచి ప్రయాణిస్తాం. గమ్యస్థానానికి దగ్గరవుతున్నామంటే స్పీడ్‌ నెమ్మదిగా వెళ్తాం. ఇలా అనేక రకాలుగా ఆ మైలు రాళ్లు మనకు ఉపయోగపడతాయి. వాటితో దూరాలను కూడా తెలుసుకోవచ్చు. అయితే మనకు కనపడే మైలు రాళ్ల పై భాగంలో ఒక్కోసారి ఒక్కో కలర్‌ ఉంటుంది గమనించారా..? అవును, కరెక్టే. అయితే అలా మైలు రాళ్లకు భిన్నమైన రంగులను పై భాగంలో ఎందుకు వేస్తారో తెలుసా..? అదే ఇప్పుడు తెలుసుకుందాం.

why the milestones we see on indian roads are different in colourమైలు రాళ్ల పై భాగంలో పసుపు రంగు ఉంటే మనం జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్నామని తెలుసుకోవాలి. మన దేశంలో కేవలం కొన్ని మాత్రమే జాతీయ రహదారులు ఉంటాయి. వాటిపై ఉండే మైలు రాళ్లకు పై భాగంలో ఇలా పసుపు రంగులో పెయింట్‌ వేస్తారు. దీంతో అవి జాతీయ రహదారులు అని తెలుస్తాయి.

why the milestones we see on indian roads are different in colour

మైలు రాళ్ల పైభాగంలో ఆకుపచ్చ రంగు ఉంటే అవి స్టేట్‌ హైవేలు అని తెలుసుకోవాలి. వాటిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే వేస్తాయి. వాటి పర్యవేక్షణను రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకుంటాయి.

why the milestones we see on indian roads are different in colour

మైలు రాళ్ల పై భాగంలో తెలుపు లేదా నలుపు రంగు ఉంటే మనం ప్రయాణిస్తున్నది పెద్ద నగరం లేదా జిల్లా అని తెలుసుకోవాలి. ఇలాంటి రహదారులను ఆ నగర లేదా జిల్లా అభివృద్ధి శాఖే పర్యవేక్షిస్తుంది.

why the milestones we see on indian roads are different in colour

ఇక మైలు రాళ్ల పైభాగంలో ఆరెంజ్‌ లేదా ఎరుపు రంగు పెయింట్‌ వేసి ఉంటే మనం గ్రామంలో ఉన్నామని తెలుసుకోవాలి. అలాగే ఈ రోడ్లను ప్రధాన్‌ మంత్రి గ్రామ్‌ సడక్‌ యోజన కింద నిర్మించారని అర్థం చేసుకోవాలి.

Share.

Comments are closed.