బిత్తిరి సత్తి రియల్ లైఫ్ తెలిస్తే మీరు షాక్ అవుతారు ..!

0

V6 Teenmar Bithiri Sathi Real life story
విస్తృతంగా సాంకేతిక అందుబాటులోకి రావడంతో ప్రపంచం కుగ్రామంగా మారింది ఎన్నోసార్లు వినే ఉంటారు. అదేమోగాని శాటిలైట్, ఇంటర్నెట్ మాత్రం విరివిగా అందుబాటులోకి వచ్చింది. తెలుగు శాటిలైట్ ఛానళ్లు.. అదీ విస్తృతంగా ఏర్పాటైన న్యూస్ ఛానళ్లు అనేక మందికి నేమ్, ఫేమ్ తెచ్చిపెట్టాయి. అలా న్యూస్ ఛానళ్ల ద్వారా పాపులర్ అయి ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో సైతం బిజీ అవకాశాలు దక్కించుకుంటున్న వారిలో బిత్తిరి సత్తి పేరు టాప్ లోనే చెప్పుకోవాలి. వీ-6 ఛానల్ లో తీన్మార్ అనే సెటైరికల్ వార్తల ద్వారా బాగా పాపుల‌ర్ అయ్యాడు బిత్తిరి స‌త్తి. అసలు అతడి పేరు ర‌వి అని కూడా చాలా మందికి తెలియదు. అంతే కాదు చాలా మందికి తెలియని విషయం అంత‌కుముందు ర‌వి కొన్నిఛానెళ్ల‌లో చేసిన ప్రోగ్రామ్స్ అత‌డికి గుర్తింపు రాలేదు. అయితే వీ-6లో వ‌చ్చిన తీన్మార్ ప్రోగ్రామ్ ద్వారా అత‌డి రేంజ్ మారిపోయింది. ఆ తీన్మార్ ప్రోగ్రామ్‌లో అత‌డు వేసే సెటైర్ల‌కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

V6 Teenmar Bithiri Sathi Real life storyలోడాస్ లాగు, రంగుపూల చొక్కా, అంట క‌త్తెర జుట్టు, ఎడ్డి మాట‌లు, అమాయ‌క‌పు చూపుల‌తో తీన్మార్‌లో బిత్తిరి స‌త్తి సూప‌ర్ పాపుల‌ర్ అయ్యాడు. ఫిమేల్ యాంకర‌్లను ప‌క్క‌న‌పెడితే… మేల్ యాంక‌ర్‌ల‌లో బిత్తిరి స‌త్తికి ఉన్న పాపులారిటీ డిఫ‌రెంట్‌. తాను వీ6లో ప‌నిచేస్తూ ఇత‌ర టీవీ చానెల్స్‌కి ద‌డ పుట్టిస్తున్నాడు. ఓ సెటైరిక‌ల్ ప్రోగ్రామ్‌ని ఇలా కూడా చేయొచ్చా అనే విధంగా బిత్తిరి స‌త్తి ఆ ప్రోగ్రామ్‌కి సెట్ అయ్యాడు. తీన్‌మార్‌కి ఓ బ్రాండ్ క్రియేట్ చేశాడు. అంతేకాదు తనకు తానే ఓ బ్రాండ్‌గా మారాడు.సాధార‌ణంగా విసుగుపుట్టించే న్యూస్‌ని సైతం.. త‌న‌ద‌యిన మేన‌రిజ‌మ్స్‌తో, స్ట‌యిల్‌తో, నరేష‌న్‌తో బిత్తిరిస‌త్తి తీన్‌మార్‌తో ఆక‌ట్టుకునేలా మారుస్తున్నాడు. అందుకే తీన్మార్ కాన్సెప్ట్ వరకు వీ6కు టాప్ రేటింగ్ తెచ్చిపెడుతోంది. తెలంగాణ యాస‌, మాండ‌లికంతో చేసినా..

V6 Teenmar Bithiri Sathi Real life story

దానికి ఆంధ్ర, రాయ‌ల‌సీమ వాసులు కూడా చూడడానికి అమితాసక్తిని చూపిస్తున్నారు. అంతేకాదు ఒకప్పుడు తెలంగాణ యాసను సినిమాల్లో విలన్లకో, కమెడియన్లకో మాత్రమే వాడేవారు. కాని ఇప్పుడు ఏకంగా ‘ఫిదా’వంటి పక్కా తెలంగాణ ఓరియెంటెడ్ సినిమాలు సూపర్ సక్సెస్ అయ్యాక.. తెలంగాణ మాండలికానికి, యాసకు సినిమాల్లో చాలా క్రేజ్, స్పేస్ ఉందని నిర్మాతలు, దర్శకులు గుర్తించారు. దీంతో ఇప్పుడు బిత్తిరి సత్తి, కత్తి కార్తీక వంటి వారికి సినిమాల్లో భారీ ఛాన్సులకు అవకాశాలేర్పడ్డాయి. ఇక సత్తి నెల ఆదాయం విషయానికొస్తే..

అసలు మొదట సత్తిని తీసుకోవడానికే వీ6 యాజమాన్యం మొగ్గు చూపలేదట. అసలు ఆ తరహా వార్తలను పబ్లిక్ ఏమాత్రం రిసీవ్ చేసుకోరని, సత్తి అప్పీరెన్సుకు అసలే మార్కెట్ ఉండదని భావించారట. దీంతో పైసా శాలరీ లేకుండా సత్తి కెరీర్ మొదలైంది. రెండు నెలల్లోనే ఆ న్యూస్ కి వస్తున్న క్రేజ్ చూసి యాజమాన్యం 30వేల రూపాయ‌లిచ్చింది. తాజాగా ఆ కార్య‌క్ర‌మానికి స్పాన్సర్లు పెర‌గ‌డం, రేటింగ్ పెర‌గ‌డం, యూ ట్యూబ్‌లో హిట్స్ రెయిజ్ అవ‌డంతో బిత్తిరి స‌త్తికి నెల‌కు దాదాపు 1ల‌క్షా 30వేల రూపాయ‌లు చెల్లిస్తోంద‌ట‌. అయితే ఇప్పుడు సత్తి ద్వారా ఆ ఛానల్ గడిస్తున్న ఆదాయానికి సత్తికి ఇస్తున్న రెమ్యునరేషన్ కు ఏమాత్రం పొంతనలేదట. ఇక బిత్తిరి సత్తి పర్సనల్ విషయానికొస్తే..

V6 Teenmar Bithiri Sathi Real life story

చిన్నప్పటి నుంచి అవమానాలు, చీత్కారాలు అనుభవించాడు సత్తి.. ఎన్నో అవమానాలెదుర్కున్నాడు. తెలంగాణ భాష, యాసను అప్పట్లో ఆంధ్రోళ్లు చిన్నచూపు చూసినట్లే తన పట్లా వివక్షే నడిచిందని పలుమార్లు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు సత్తి. నేలకేసి కొట్టిన బంతిలా.. కసిగా ప్రయత్నించి ఇప్పుడు పెద్ద పాపులర్ అయ్యాడు. ఇక సత్తి.. అదే రవి తన గురించి ఇలా వివరించారు ఓ ఛానల్ ఇంటర్వ్యూలో..మాది రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని పామెన గ్రామం. మా అమ్మానాన్నలు నర్సింహులు, యాదమ్మ. మా తల్లిదండ్రులకు మా అక్క, నేను ఇద్దరమే సంతానం. మా నాన్న కావలికారు కావడంతో ప్రతి రోజు ఆయన వెంట చిన్నప్పటి నుంచి ఇంటింటికి తిరిగేవాడిని. ప్రతి ఇంట్లో రకరకాల మనస్తత్వాలున్న మనుషుల్ని చూసి వారి హావభావాలు, మనస్తత్వాలను అర్థం చేసుకొని ప్రతి రోజూ వారిని అనుకరిస్తూ మాట్లాడేటోన్ని.

6వ తరగతికి వచ్చేసరికి పాటలు, మాటలతో మా తరగతిలోని వాళ్లందరిని నవ్వించేటోన్ని. 5వ తరగతి వరకు మా ఊళ్లోనే చదువుకున్న తర్వాత మా ఊరికి 10 కి.మీ.ల దూరంలో ఉన్న చెన్వెల్లికి ప్రతి రోజు నడుచుకుంటూ వెళ్లి 10వ తరగతి వరకు చదువుకున్నా. ఇంటర్మీడియట్‌ను చేవెళ్లలో చదివినా.. పాఠశాలలు, కళాశాలల్లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర పోటీల్లో పాల్గొనేటోన్ని. గప్పట్ల స్నేహితులు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా లేకుంటే సినిమా నటునిగా నీవు రాణిస్తావని చెప్పిండ్రు. అప్పటి నుంచి ప్రతి రోజు మా ఊరి నుంచి హైదరాబాద్‌కు వెళ్లి సినిమాలు, టీవీల్లో నటించేందుకు ప్రయత్నించినా, కాని ఎక్కడికెళ్లినా.. నాకు అవమానాలు తప్పలేదు.

ఈ సమయంలోనే నాకు వివాహమైంది. అయినా ఓ వైపు కుటుంబ పోషణ కోసం వ్యవసాయం చేస్తూనే మరో వైపు నా ప్రయత్నాలను మానలేదని ఆయన పేర్కొన్నారు. అవమానం జరిగిన ప్రతి సారీ కళ్లలో నీళ్లు తిరిగేవి. 15 ఏళ్ల అవమానాలు, కష్ట నష్టాలను భరించి డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా అవకాశం పొందాను. మొదట్లో చిన్న చిన్న అవకాశాలొచ్చాయి. తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న నేపథ్యంలో టీవీ ఛానళ్లలో తెలంగాణ భాషకు ప్రాధాన్యత వచ్చింది. మొదట్లో 6 టీవీలో నర్సయ్య తాతగా పనిచేశాను. తర్వాత వీ6 లో బిత్తిరి సత్తిగా పరిచయమయ్యా… అని చెప్పుకొచ్చారు.

Share.

Comments are closed.