గూగుల్‌ ప్లేస్టోర్‌లో ‘యూసీ బ్రౌజర్‌’ మాయం..!

0

ప్ర‌ముఖ‌ అలీబాబా కంపెనీకి చెందిన ‘యూసీ బ్రౌజర్‌’ ఇప్పుడు గూగుల్‌ ప్లేస్టోర్‌లో కన్పించడం లేదు. 500 మిలియన్‌ డౌన్‌లోడ్లకు చేరుకున్న యూసీ మొబైల్‌ బ్రౌజర్‌ కొన్ని వారాల్లోనే ఇలా ప్లేస్టోర్‌ నుంచి మాయమవడం గమనార్హం. అయితే, యూసీ బ్రౌజర్‌ మినీ మాత్రం గూగుల్‌ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంది.భారత వినియోగదారుల నుంచి ఇది సమాచారాన్ని తస్కరించి చైనా సర్వర్లకు చేరవేస్తోందని ఆరోపణలు ఉన్నాయి.

uc browser removed from play store

ఈ బ్రౌజర్‌పై భారత ప్రభుత్వం నిఘా కూడా పెట్టింది. మరో ఆరోపణ కూడా ఈ బ్రౌజర్‌పై ఉంది. బ్రౌజర్‌ను అన్‌ఇన్‌స్టాల్‌ చేసినప్పటికీ.. లేక బ్రౌజింగ్‌ డేటా డిలీట్‌ చేసినప్పటికీ.. వాటిపై ఇంకా యూసీ బ్రౌజర్‌ నియంత్రణ పోవడం లేదని పలువురు ఆరోపించారు. ఆగస్టులో భారత ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖకు చెందిన ఓ అధికారి ఈ వ్యవహారంపై మాట్లాడుతూ.. యూసీ తప్పుచేసినట్లు తేలిచే దాన్ని భారత్‌లో నిషేధిస్తామని పేర్కొన్నారు.

యూసీ బ్రౌజర్‌లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి తాజా ఘటనపై స్పందించారు. ‘నాకు ఈరోజు ఓ మెయిల్‌ వచ్చింది. యూసీ బ్రౌజర్‌ను 30 రోజులపాటు తాత్కాలికంగా ప్లేస్టోర్‌ నుంచి తీసివేస్తున్నట్లు అందులో సమాచారం ఉంది. డౌన్‌లోడ్లు పెంచుకునేందుకు యూజర్లను తప్పుదారి పట్టించినందుకు, అనారోగ్యకర విధానాలను అవలంబించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో ఉంది’ అని అతను పేర్కొన్నాడు.

Share.

Comments are closed.