ప‌వ‌న్ రాజ‌కీయాల‌పై టీవీ9 సీఈవో ర‌వి ప్ర‌కాష్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు…!

0

ప‌త్రిక‌లు, టీవీ చానళ్లు ఏదో ఒక రాజ‌కీయ పార్టీకి భ‌జ‌న చేయ‌డం మ‌న ద‌గ్గ‌ర మామూలే. అయితే ఏంటి… ఇదేం కొత్త కాదు క‌దా..! అంటారా..! అవును, కొత్త కాదు. కానీ… ఇప్పుడా కోవ‌లోకి టీవీ9 కూడా చేరిన‌ట్టు క‌నిపిస్తోంది. ఎందుకో అంద‌రికీ తెలిసిందే. అదేనండీ… ఇటీవ‌లే జ‌రిగిన కాట‌మ‌రాయుడు ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌కు టీవీ9 సీఈఓ ర‌విప్ర‌కాష్ వెళ్లారు క‌దా. అందుకే… ఆ మాట అనాల్సి వస్తోంది.

ravi-prakash-speech-katamarayudu

కాట‌మ‌రాయుడు ఫంక్ష‌న్‌కు వెళ్లిన ర‌వి ప్ర‌కాష్ సినిమా గురించి కాకుండా నేటి త‌రం రాజకీయాలు ఎలా త‌యార‌య్యాయి అనే దానిపై ప్ర‌సంగించారు. అంతేకాదు, ప‌వ‌న్ క‌ల్యాన్ నేటి త‌రం రాజ‌కీయ నాయ‌కుల్లా కాద‌ని, ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేస్తున్నాడ‌ని, అందుకే ఆయ‌నంటే అభిమాన‌మ‌ని ర‌విప్ర‌కాష్ చెప్పారు. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో పాటు యువ‌త క‌ల‌సి ముందుకు రావాల‌ని, రాజ‌కీయాల్లో త‌మ దైన ముద్ర వేయాల‌ని, స‌మ‌స్య‌ల‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేయాల‌ని, రాజ‌కీయ నాయ‌కుల‌ను ప్ర‌శ్నించాల‌ని ర‌విప్ర‌కాష్ స్పీచ్ ఇచ్చారు.

దీన్ని బ‌ట్టి తెలుస్తుందేమిటంటే… రానున్న 2019 ఎన్నిక‌ల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప‌వ‌న్ పార్టీ జన‌సేన పోటీ చేయ‌నుంది క‌దా. ఆ నేప‌థ్యంలోనే ఇప్ప‌టి నుంచే గ్రౌండ్ వ‌ర్క్ స్టార్ట్ చేసిన‌ట్టు అనిపించ‌డం లేదూ..! అన్న‌ట్టు… ఆ ఫంక్ష‌న్‌కు ఎన్‌టీవీ అధినేత చౌద‌రి కూడా హాజ‌ర‌య్యారు క‌దా..! మ‌రి ఆయ‌న మ‌న‌సులో ఏముందో..! ఏమో.. లోగుట్టు పెరుమాళ్ల కెరుక‌..!

Share.

Comments are closed.