రూమ్‌మేట్‌కి అవ‌కాశ‌మిచ్చిన త్రివిక్ర‌మ్‌!

0
tivikram srinivas gives chance to sunil

tivikram srinivas gives chance to sunil

హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు సోమవారమే పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టిన సంగతి తెలిసిందే. ఆ మూవీలో ఓ ముఖ్య పాత్రలో త్రివిక్ర‌మ్ స్నేహితుడు, రూమ్‌మేట్ నటించనున్నట్లు సమాచారం. ఇంత‌కీ ఆ రూమ్‌మేట్ ఎవ‌రో తెలుసా? హాస్య‌న‌టుడిగా నూటికి నూరు మార్కులు తెచ్చుకుని హీరోగా ప్ర‌య‌త్నించి పాస్ మార్కులు కూడా సంపాదించ‌లేక‌పోయిన సునీల్‌. అవును.. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రాబోతున్న కొత్త సినిమాలో సునీల్ మ‌ళ్లీ క‌మెడియ‌న్‌గా క‌నిపించ‌నున్నాడు.

ఈ సినిమాకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ క్లాప్ కొట్టిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఒక‌ప్పుడు హాస్య నటుడిగా ఓ వెలుగు వెలిగాడు సునీల్. తర్వాత హీరోగా మారాడు. కానీ ఆయన ఆశించిన స్థాయిలో సినిమాలు ఆడలేదు. వరుసగా సినిమాలు చేస్తున్నా.. ఖాతాలో మాత్రం ఒక్క హిట్ కూడా ప‌డ‌టం లేదు. న‌టుడిగా స‌క్సెస్ అయిన సునీల్‌కి హీరోగా ప్ర‌తీసారి ఫెయిల్ అవుతున్నాడు. హీరోగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సునీల్‌కు త్రివిక్రమ్ మరోసారి లైఫ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సునీల్ టాప్ పొజిషన్‌కు చేరుకోవడం వెనుక మాటల రచయితగా, డైరెక్టర్‌గా త్రివ్రిక్రమ్ తన వంతు సహకారం అందించాడు.

 

ఆయన రాసిన డైలాగ్‌లు సునీల్ నోటి నుంచి వచ్చిన విధానాన్ని ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోరు. రూమేట్స్ అయిన వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, సంతోషం, మల్లీశ్వరి, అతడు లాంటి సినిమాలు సునీల్ కెరీర్‌కు ఎంతగానో ఉపయోగపడ్డాయి. వాస్తవానికి ఆ పాత్రను నారా రోహిత్ చేయాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల కుదర్లేదు. దీంతో ఆ పాత్రలో సునీల్ నటించేలా త్రివిక్రమ్ ఎన్టీఆర్‌ను ఒప్పించారట. హాస్య నటుడిగా సునీల్ ఓ వెలుగు వెలిగాడు. తనదైన టైమింగ్‌తో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించాడు.

Share.

Comments are closed.