ముఖం అందంగా మారాలంటే ఇలా చేయాలి..!

0

ముఖం అందంగా క‌నిపించాల‌ని ప్ర‌తి ఒక్క‌రికీ ఉంటుంది. నేటి త‌రుణంలో అయితే పురుషులు కూడా త‌మ అందం ప‌ట్ల అత్యంత శ్ర‌ద్ధ‌ను క‌న‌బ‌రుస్తున్నారు. అయితే ఎవ‌రికైనా ముఖం అందంగా క‌నిపించాలంటే మార్కెట్లో ర‌క ర‌కాల క్రీములు, స‌బ్బులు ల‌భిస్తున్నాయి. కానీ వాటితో ప‌ని లేకుండా కింద చెప్పిన టిప్స్ ఫాలో అయితే చాలు. దాంతో ముఖం అందంగా క‌నిపించేలా చేసుకోవ‌చ్చు. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

tips for facial beauty

1. కొద్దిగా నువ్వుల నూనెను తీసుకుని వేడి చేసి చ‌ల్లార‌నివ్వాలి. దాన్ని రాత్రి ప‌డుకునే ముందు క‌ళ్ల కింద, ముఖంపై రాయాలి. ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేస్తుంటే కళ్ల కింది ముడతలు పోయి చర్మం మృదువుగా అందంగా తయారవుతుంది. ఇంకా ముఖం కూడా కాంతివంతంగా క‌నిపిస్తుంది.

2. ఆముదం, కొబ్బరి నూనెలు కూడా చ‌ర్మం ముడతలకు చెక్ పెడతాయి. కొబ్బరినూనెను నిద్రించే ముందు ముఖానికి రాయాలి. ఉదయాన్నే లేచి గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరచుకోవాలి. దీని వల్ల కళ్ల కింద ముడతలు పోయి అందంగా త‌యార‌వుతారు.

3. చర్మంపై కొబ్బరి నూనెతో మర్ధన చేసుకుంటే చర్మం మృదువుగా తయారవటంతో పాటు మచ్చలు తొలగిపోతాయి.

4. ఆముదం నూనె కూడా ముడతలు, మచ్చలపై మెరుగ్గా పనిచేస్తుంది. కళ్ల కింద ఉండే ముడతలు, మచ్చలు పోవాలంటే వాటిపై రాత్రి నిద్రపోయే ముందు ఆముదంతో మర్ద‌నా చేయాలి. దీంతో చ‌ర్మానికి కాంతి పెరిగి ముఖం అందంగా మారుతుంది.

Share.

Comments are closed.