6 గంట‌ల పాటు ఆమె బొమ్మ‌గా నిలుచుంటే… న‌గ్నంగా చేసేశారు..!

0

Marina Abramovic on performingమ‌నుషుల‌లో అస‌లు మాన‌వ‌త్వం అనేది ఉంటుందా..? క‌చ్చితంగా ఉండ‌దు. చాలా మందిలో ఉండ‌దు. అందుకు ఇప్పుడు మేం చెప్ప‌బోయే ఓ సంఘ‌ట‌నే నిద‌ర్శ‌నం. అయితే ఇది ఇప్పుడు జ‌రిగింది కాదు. అది 1974ల నాటి మాట‌. అప్ప‌ట్లో యుగోస్లేవియా అనే ఓ దేశంలో జ‌న్మించింది మ‌రీనా అబ్ర‌మోవిక్ అనే ఓ మ‌హిళ‌. ఆమె ఓ ప్ర‌యోగం చేయాల‌నుకుంది. అయితే అది సైంటిఫిక్ ప్ర‌యోగం కాదు, సామాజిక ప్ర‌యోగం. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఇంత‌కీ అదేమిటంటే…

ఒక మ‌హిళ విగ్ర‌హంలా 6 గంట‌ల పాటు క‌ద‌ల‌కుండా, మెద‌ల‌కుండా నిలుచుంటే ఆమె చుట్టూ ఉన్న వారు ఏం చేస్తారో చూడాల‌నిపించింది ఆమెకు. ఇంకేముందీ… వెంట‌నే ప్ర‌యోగం చేసింది. ఈ క్ర‌మంలో ఆమె విగ్ర‌హంలా నిలుచుంది. అదే క్ర‌మంలో త‌న ప‌క్క‌నే ఓ టేబుల్ ను ఏర్పాటు చేసుకుంది. దానిపై 72 వ‌స్తువులు పెట్టింది. వాటితో త‌న‌ను ఏమైనా చేసుకోవ‌చ్చు అని ఓ ప్ర‌క‌ట‌న కూడా రాసి త‌న పక్క‌నే బోర్డులా పెట్టుకుంది. ఆ వ‌స్తువుల్లో తేనె, ద్రాక్ష‌, రోజా పూలు, తుపాకీ, క‌త్తెర వంటి వ‌స్తువులు ఉన్నాయి.

అయితే ఆమె అలా వ‌స్తువుల‌ను ఎందుకు పెట్టింది అంటే… అలాంటి స్థితిలో ఎవ‌రి మ‌న‌స్త‌త్వం ఎలా ఉంటుందో తెలుసుకోవ‌చ్చ‌ని అనుకుంది. అందుకే ఆ వ‌స్తువుల‌ను పెట్టింది. ఈ క్ర‌మంలో గంట‌లు గ‌డుస్తున్న కొద్దీ ఆమెపై కొంద‌రు మృగాళ్లు విరుచుకుప‌డ్డారు. మొద‌ట ఆమె బాగానే ఉంది కానీ గంట గ‌డిచిన త‌రువాత ఆమె నిలుచున్న చోటు నుంచి ఆమెను మోసుకుని వెళ్లారు. ఒక ప‌క్క‌న ఆమెను టేబుల్ మీద కూర్చోపెట్టి ర‌క‌ర‌కాల హానిక‌ర‌మైన వ‌స్తువుల‌తో ఆమె శ‌రీరాన్ని గాయ‌ప‌రిచారు. ఆ త‌రువాత ఆమెను క‌ట్టేశారు. అనంత‌రం ఆమె మీద నీళ్లు పోశారు. కొంత సేప‌టికి ప్ర‌జ‌లు మ‌రీ దిగ‌జారిపోయారు. ఆమెను ముద్దు పెట్టుకోవ‌డం, కౌగిలించుకోవ‌డం కూడా చేశారు. అంతేకాదు, మ‌రీ నీచానికి దిగ‌జారి ఆమె వ‌స్త్రాలు తీసి అంద‌రి ముందు ఆమెను న‌గ్నంగా నిల్చోబెట్టారు. ఇలా అంద‌రూ ఆమెకు 6 గంట‌ల పాటు న‌ర‌క‌యాత‌న చూపించారు. అయితే 6 గంట‌ల త‌రువాత ఆమె ప‌రిశోధ‌న ముగించుకోగా, ఆ త‌రువాత‌ ఎవ‌రైతే ర‌క‌ర‌కాలుగా ఆమెను అవ‌మానించారో వాళ్లు సిగ్గుతో త‌ల‌దించుకున్నారు. కావాలంటే ఆ సంఘ‌ట‌న తాలూకు ఫొటోలు కింద ఉన్నాయి. వీడియోలో వాటిని చూడ‌వ‌చ్చు..!

Share.

Comments are closed.