శృంగారాన్ని ఆస్వాదించ‌డానికి బెస్ట్ టైం ఏదో తెలుసా..?

0

this is the right time to enjoy in srungaram

శృంగారాన్ని ఆస్వాదించ‌డానికి బెస్ట్ టైం ఏదో తెలుసా..? చాలా మంది దీనికి ఏమ‌ని స‌మాధానం చెబుతారు..! ఇంకేం చెబుతారు. రాత్రి పూట అని అంటారు..!  అదేంటో కింద చ‌దివి తెలుసుకోండి.శృంగారాన్ని ఆస్వాదించడానికి ఉదయమే బెస్ట్ టైం అని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ఉదయాన్నే రతి క్రీడలో పాల్గొనడం వల్ల ఆలుమగలు చక్కటి మూడ్‌తో రోజును ప్రారంభించడానికి వీలవుతుందట. రాత్రంతా నిద్రించడం వల్ల శరీరానికి తగిన విశ్రాంతి లభించడంతోపాటు వేకువ జామున టెస్టోస్టిరాన్ హార్మోన్ స్థాయిలు అధికంగా ఉంటాయి.

మహిళలకు ప్రతినెలా హర్మోన్ సైకిల్ ఎలా ఉంటుందో అదే తరహాలో పురుషులకు మార్నింగ్ టైంలో మంచి మూడ్ ఉంటుంది. పగటి వేళ ఇంత జోష్ ఉండదు. రాత్రిపూట మగాళ్లు చాలా కేరింగ్‌గా ఉంటారు. పురుషుల్లో శృంగారానికి అత్యంత అవసరమైన టెస్టోస్టిరాన్ హార్మోన్ లైంగిక కోరికలను ప్రభావితం చేస్తుంది.

అందుకే చాలా మందిలో ఉదయం పూట అంగస్తంభనలు ఉంటుంటాయి. దాన్నే ఇంగ్లిష్‌లో మార్నింగ్ వుడ్ అంటుంటారు. ఉదయం పూట అంగస్తంభనలు అసంకల్పితంగా కలుగుతాయి. ఆరోగ్య వంతులైన పురుషుల్లో, యుక్త వయస్కుల్లో అది చాలా సాధారణంగా జరిగేదే. అంతే కానీ ఉదయం పూట అంగస్తంభనలు ఉన్నాయంటే వారికి అందమైన అమ్మాయిలు కలలోకి వచ్చారని కాదు. కాబ‌ట్టి ఉద‌యం పూటే శృంగార ర‌సాస్వాద‌నకు మంచి టైం..!

Share.

Comments are closed.