అయ్యప్ప స్వామి ప్రసాదంలోని ఆరోగ్య రహస్యం మీకు తెలుసా?!

0

swamy Ayyappa prasadam Health Secretsశబరిమళ దివ్య క్షేత్రం పేరుకు కేరళలో ఉన్నప్పటికీ.. కార్తీకమాసం ఆరంభంతోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మనకు నల్లని వస్త్రాలు ధరించిన భక్తులు ఎక్కువగా కనిపిస్తుంటారు. వీరిని స్వామి అని సంభోదించి వారిని మర్యాదతో చూసుకోవడం మన సాంప్రదాయం. హరిహరసుతుడు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకొని 41 రోజులపాటు అత్యంత నిష్ఠతో దీక్ష చేస్తారు. ఈ దీక్షాసమయంలో భక్తులు అయ్యప్పను అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తారు.ఇలా అయ్యప్పను 41 రోజులపాటు భక్తి శ్రద్దలతో పూజించి ఇరుముడి కట్టుకొని శబరిమల వెళ్తారు. ఇరుముడిలో బియ్యం, కొబ్బరికాయ, నెయ్యిని ఉంచుతారు.

నల్లని వస్త్రంలో ఇరుముడికి సంబంధించిన వస్తువులను ఉంచి మూటగా కట్టి భక్తులు నెత్తిన పెట్టుకొని శబరిక్షేత్రం చేరుకుంటారు. కేరళలోని పత్తనంతిట్ట జిల్లాలోని పశ్చిమ కనుమల్లో శబరిక్షేత్రం ఉన్నది. ఈ క్షేత్రంలో అయ్యప్ప స్వామి కొలువై ఉన్నాడు. కేరళ వృశ్చిక మాసం ఉంచి అయ్యప్ప స్వామి దర్శనం మొదలౌతుంది. సంవత్సరంలోని అన్ని రోజులు అయ్యప్ప స్వామి దర్శనానికి అనుమతి ఉండదు.ఇక అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్న భక్తులు అయ్యప్ప అరవణి ప్రసాదం తీసుకొస్తారు. డబ్బాల్లో విక్రయించే ఈ ప్రసాదం చాలా రుచిగా ఉంటుంది. బియ్యం, నెయ్యి, బెల్లాన్ని ఉపయోగించి ఈ ప్రసాదం తయారు చేస్తారు.

ఇందులో అనేక పోషక పదార్ధాలు ఉంటాయి. ఆరోగ్యానికి ఎంతగానో మంచిది. చలికాలంలో ఈ ప్రసాదం శరీరంలో వేడిని కలిగిస్తుంది. మావెలిక్కరలోని ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు పరిధిలోని చెట్టికులంగర దేవి ఆలయం నుంచి ప్రసాదం తయారు చేయడానికి కావాల్సిన బియ్యం వస్తుంది.ఇక ప్రతి సంవత్సరం ఈ దేవాలయాన్ని కనీసం రెండు నుంచి పది లక్షల మండి దర్శించుకుంటారని అంచనా. భక్తుల కోసం ప్రతి ఏడాది 80 లక్షల అరవణ ప్రసాదాన్ని తయారు చేస్తారట. మన దేశంలో ఇప్పుడు తిరుమల తరువాత అత్యంత ఎక్కువ మంది భక్తులు దర్శించుకునే దేవాలయం శబరిమల కావడం విశేషం.

 

Share.

Comments are closed.