ఇదేం కాలేజ్‌..! బ్రా తీస్తేనే ఎగ్జామ్ రాయ‌నిస్తార‌ట‌..!

0

Students forced to remove their bra at NEET Medical Test Examఇటీవల కాలంలో దేశంలో నిర్వహిస్తున్న పలు పరీక్షలు నిజంగా అభ్యర్థులకు పరీక్ష పెడుతున్నాయి. పరీక్షల సందర్భంగా విధిస్తున్న నిబంధనలు వారిని తెగ ఇబ్బంది పెడుతున్నాయి. తాజాగా ఆదివారం దేశవ్యాప్తంగా నిర్వహించిన జాతీయ అర్హత పరీక్ష (నీట్)కు హాజరైన విద్యార్థులు ముఖ్యంగా విద్యార్థినులు అధికారుల ‘డ్రెస్ కోడ్’తో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

కేరళలోని కన్నూరులో పరీక్షా కేంద్రానికి వెళ్లిన ఓ విద్యార్థిని బ్రా ధరించడంతో పరీక్ష రాసేందుకు అడ్డు చెప్పారు. దానిని తొలగించి వస్తేనే పరీక్ష రాసేందుకు అనుమతిస్తామని చెప్పడంతో ఆమె ఒక్కసారిగా షాక్ కు గురైంది. చేసేది లేక దానిని తొలగించి బయట ఉన్న తల్లి చేతిలో పెట్టి పరీక్షకు హాజరైంది. పరీక్ష హాలు నుంచి బయటకు వచ్చిన కుమార్తె తన చేతిలో టాప్ ఇన్నర్ వేర్ పెట్టి మళ్లీ వేగంగా లోపలికి వెళ్లిపోయిందని విద్యార్థిని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.

పరీక్ష పూర్తయిన అనంతరం విద్యార్థిని ఈ విషయాన్ని మీడియాకు తెలియజేసింది. ‘నీట్’లో డ్రెస్ కోడ్ విధించడంతో దేశవ్యాప్తంగా పలువురు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరీ ఇంత విచిత్రమైన నిబంధనలు… అమ్మాయిలను అవమానించేలాంటి నిబంధనలు అవసరమా అన్న చర్చ మొదలైంది.

Share.

Comments are closed.