శృంగారం చేయ‌డానికి క‌రెక్ట్ స‌మ‌యాలు ఇవే తెలుసా..?

0

best timings for srungaramప్ర‌తి దానికి ఒక స‌మ‌యం సంద‌ర్భం ఉంటుంద‌ని అంటారు. నిజ‌మే మ‌రి. ఏ స‌మ‌యంలో ఏ ప‌ని చేయాలో స‌రిగ్గా తెలిసి చేస్తే మంచి ఫ‌లితాలు ఉంటాయి. శృంగారానికి కూడా ఈ టైమింగ్స్ పాటిస్తే మంచిది. రోజుకి 3 పూట‌లు శృంగారం చేయ‌వ‌చ్చ‌ని, వాటికి టైమింగ్స్ నిర్దేశించారు ప‌రిశోధ‌కులు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉద‌యం 5 నుంచి 8 గంట‌ల లోపు…
ఉద‌యాన్నే శృంగారానికి మించిన వ్యాయామం ఉండ‌ద‌ట‌. ఈ స‌మ‌యంలో మ‌గ‌వారిలో టెస్టోస్టిరాన్ స్థాయిలు ఎక్కువ‌గా ఉంటాయి. అత్యంత తృప్తిక‌ర‌మైన శృంగారం ఈ స‌మ‌యంలో పూర్తిగా సాధ్య‌ప‌డుతుంద‌ట‌. మార్నింగ్ ర‌తి వ‌ల్ల రోగ నిరోధక శ‌క్తి కూడా పెరుగుతుంద‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి.

మధ్యాహ్నం 12 నుంచి 3 గంట‌ల లోపు…
మ‌ధ్యాహ్నం అయితే చాలు మ‌న‌లో చాలా మందికి ఎక్క‌డ లేని బ‌ద్ద‌కం వ‌స్తుంది. ఏ ప‌ని మీద స‌రిగ్గా దృష్టి పెట్ట‌లేం. ఏ విష‌యాన్నీ స‌రిగ్గా గ్ర‌హించ‌లేం. ఇలా బ‌ద్ద‌కంగా ఉండ‌కూడ‌దు అంటే, శృంగారంలో పాల్గొనాల్సిందే అంటున్నారు సైకాల‌జిస్టులు. మనం చురుగ్గా ఉండాలంటే శృంగారం చేయాల్సిందేన‌ట‌.

రాత్రి 8 నుంచి 11 గంట‌ల లోపు…
ఎవ‌రికైనా ఈ స‌మ‌యం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. శృంగారానికి పూర్తిగా అనుకూల‌మైన స‌మ‌య‌మిది. రోజంతా గురైన ఒత్తిడిని ఈ సమ‌యం దూరం చేస్తుంది. అలా ఒత్తిడి దూర‌మ‌వ్వాలంటే ఈ స‌మ‌యంలో శృంగారంలో పాల్గొనాలి. ఆక్సిటోసిన్‌, ఎండ్రోఫిన్స్ అనే ర‌సాయ‌నాలు బాగా విడుద‌లై ఒత్తిడిని మ‌టు మ‌యాం చేస్తాయి. శృంగారంలో చ‌క్క‌ని తృప్తిని ఇస్తాయి.

Share.

Comments are closed.