డీటీహెచ్ రంగంలోకి జియో..? త‌్వ‌ర‌లో సెట్ టాప్ బాక్సుల విడుద‌ల‌..?

0

jio-dthజియో 4జీ… టెలికాం రంగంలో ఓ సంచల‌నం. వెల్‌క‌మ్ ఆఫ‌ర్ మొద‌లు కొని ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో ఆఫ‌ర్ల‌ను జియో ప్ర‌క‌టించింది. ఈ క్ర‌మంలో జియో సేవ‌ల‌ను వాడుతున్న యూజ‌ర్లు పండ‌గే పండ‌గ చేసుకుంటున్నారు. ఉచిత 4జీ డేటా వ‌స్తుండ‌డంతో చాలా మంది ఇంట‌ర్నెట్ కోసం జియోనే వాడుతున్నారు. అయితే ప్ర‌స్తుతం ప్రైమ్ మెంబ‌ర్‌షిప్ ప్ర‌క‌టించినా జియో జోరు మాత్రం త‌గ్గ‌లేదు. యూజ‌ర్లు ఇంకా జియో సేవ‌ల కోస‌మే చూస్తున్నారు. అంత‌లా జియో యూజ‌ర్ల‌ను ఆక‌ర్షిస్తోంది. అయితే కేవ‌లం టెలికాం రంగంలోనే కాదు, త్వ‌ర‌లో డీటీహెచ్ రంగంలో కూడా జియో ప్ర‌వేశిస్తున్న‌ద‌ట‌. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే.

జియో త్వ‌ర‌లో డీటీహెచ్ రంగంలో అడుగిడ‌నుంద‌ని స‌మాచారం. ఇప్ప‌టికే అందుకు గాను గ్రౌండ్ వ‌ర్క్‌ను పూర్తి చేసిన‌ట్టు తెలిసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ డీటీహెచ్ కంపెనీ కూడా అందివ్వ లేని విధంగా జియో డీటీహెచ్ సేవ‌ల‌ను తీసుకురానుంద‌ని స‌మాచారం. కొత్త త‌ర‌హా సెట్ టాప్ బాక్స్ ల‌ను యూజ‌ర్ల‌కు ఇవ్వ‌నున్న‌ట్టు తెలిసింది. ఇవి ఐపీ ఆధారిత బాక్స్‌లుగా ఉండ‌నున్నాయ‌ని స‌మాచారం. అంటే ఇంట‌ర్నెట్ ఆధారంగా ఈ బాక్సులు ప‌నిచేస్తాయి.

jio-dth-set-top-boxఈ క్రమంలో జియో ప్ర‌వేశ‌పెట్ట‌నున్న సెట్ టాప్ బాక్సుల‌కు HDMI Port, USB Port, Ethernet Port తోపాటు ఆడియో, వీడియో కేబుల్స్ పెట్టుకునే పోర్టులు కూడా ఉండ‌నున్నాయ‌ట‌. ఈ బాక్సులు గ‌న‌క వ‌స్తే అప్పుడు వినియోగ‌దారులు మ‌రింత చౌక‌గా డీటీహెచ్ ప్ర‌సారాల‌ను వీక్షింవ‌చ్చు. అయితే దీనిపై జియో ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి స‌మాచారం వెల్ల‌డించ‌లేదు. త్వ‌ర‌లో తెలిసే అవ‌కాశం ఉంది. ఏది ఏమైనా జియో మరో సంచ‌లనానికి తెర లేపనుంద‌నే విష‌యం ఖాయంగా క‌నిపిస్తోంది.

Share.

Comments are closed.