చ‌ర్చ‌ల‌తోనే రామ మందిర వివాదానికి ప‌రిష్కారం ల‌భిస్తుంది: సుప్రీం కోర్టు

0

SC suggests negotiated settlement to end Ramjanmabhoomi-Babri Masjid dispute

అయోధ్య‌లో రామ మందిర నిర్మాణ వివాదం… ఎన్నో సంవ‌త్స‌రాల నుంచి దీనిపై సుప్రీం కోర్టులో కేసు న‌డుస్తూ వ‌స్తోంది. గ‌తంలో అంటే 2010లో అలహాబాద్ హైకోర్టు రామజన్మభూమిని మూడు భాగాలు చేయాలని తన తీర్పులో పేర్కొంది. 2.77 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ స్థలాన్ని మూడు భాగాలు చేసి ముస్లిం, హిందూ, నిర్మోహి అఖరాలకు సమానంగా పంచాలని అప్ప‌ట్లో త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. అయితే దీనిపై ఇరు వ‌ర్గాలు కోర్టుకు వెళ్లారు. దీంతో సుప్రీంలో ఆ కేసు న‌డుస్తూ వ‌స్తోంది. కాగా తాజాగా ఈ వివాదంపై సుప్రీం కోర్టు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.

రామ జన్మభూమి, బాబ్రీ మసీదు వివాదానికి చర్చలతోనే పరిష్కారం లభిస్తుందని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఎన్నో సంవ‌త్స‌రాల కాలంగా ఆ స్థ‌లం ప‌ట్ల హిందువులు, ముస్లింల మ‌ధ్య గొడ‌వలు జ‌రుగుతున్నాయ‌ని, ఈ క్ర‌మంలో అంత సున్నిత‌మైన విష‌యాన్ని కోర్టుల్లో ప‌రిష్క‌రించ‌లేమ‌ని తెలిపింది. అయితే స‌మ‌స్య పరిష్క‌రించుకోవాలంటే అది అన్ని రాజ‌కీయ పార్టీల‌తో సాధ్య‌మ‌వుతుంద‌ని న్యాయ‌మూర్తి తెలిపారు.

అయోధ్య వివాదం ప‌రిష్కారానికి రాజకీయ పార్టీలు కోరుకుంటే సిట్టింగ్ జడ్జ్‌ను ప్రధాన సంధానకర్తగా నియమిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేర్ ప్రకటించారు. ఆయ‌న ప్ర‌స్తుతం అందుబాటులోనే ఉన్నార‌ని, ఈ క్ర‌మంలో అన్ని పార్టీలు ఒప్పుకుంటే సమావేశం ఏర్పాటు చేసి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవ‌చ్చ‌ని ప్ర‌క‌టించారు. దీనికి మ‌రి రాజ‌కీయ పార్టీలు ఏవిధంగా స్పందిస్తాయో వేచి చూడాలి.

Share.

Comments are closed.