కొత్త సినిమాలో స‌మంత పంచెక‌ట్టు క‌ట్టుకుంది. ఎలా ఉందో చూడండి..!

0

samantha-panche-kattuఓంకార్ ద‌ర్శ‌క‌త్వంలో, పీవీపీ సంస్థ నిర్మాణంలో రాజు గారి గ‌ది 2 సినిమా తెర‌కెక్కుతున్న విష‌యం విదిత‌మే. ఇందులో స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ సీన్‌లో స‌మంత వేసుకునే డ్రెస్‌కు చెందిన ఫొటో, వీడియో తాజాగా లీక్ అయ్యాయి. వాటిలో స‌మంత అచ్చ‌మైన తెలుగు క‌ట్టు పంచెక‌ట్టులో అదిరిపోయింది. న‌టుడు రావు ర‌మేష్ తోపాటు స‌మంత ఆ సీన్‌లో ఉన్న‌ట్టు ఫొటో, వీడియో చూస్తే తెలుస్తుంది.

త్వ‌ర‌లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా ఇప్పుడు స‌మంతకు చెందిన ఈ ఫోటో, వీడియో నెట్‌లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. పంచెక‌ట్టులో అంద‌మైన ముద్దుగుమ్మ‌గా స‌మంత మెరిసిపోతుండ‌డాన్ని చూసిన అభిమానులు హ్యాపీగా ఫీల‌వుతున్నారు. ఫొటోయే ఇలా ఉంటే ఇక సినిమాలో స‌మంత ఏ రేంజ్ లో న‌టించి ఉంటుందో మ‌నం ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చ‌ని వారు అంటున్నారు. ఏది ఏమైనా స‌మంత ఈ కొత్త లుక్‌లో చాలా బాగుంది క‌దా..!

 

Share.

Comments are closed.