తల్లి కాబోతున్న సాయి పల్లవి !

0

Sai Pallavi Becomes Mother In Kanam Movie

మలయాళీ ముద్దుగుమ్మ సాయి పల్లవి, తెలుగువారి ఆదరణ ఎంతగా పొందిందో మనందరికీ తెలుసు. ఒక్క ఎంట్రీతో తెలుగువారిని ఫిదా చేసింది. ఇప్పుడు ఆమె నానితో కలసి ఎంసీఏ సినిమాలో చేస్తుంది. ఈ సినిమా ట్రైలర్‌క లో సాయిపల్లవి యాక్షన్ అందరని ఆకట్టుకుంది. అయితే ఈ సారి ఆమె మరొక డిఫ్రెంట్ పాత్రలో కనిపించబోతోంది. యిపల్లవి చేయబోయే ఆ సినిమాకి అప్పుడే భారీ అంచనాలు మొదలయిపోయాయి.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో ‘2.0’ చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ ‘కణం’ చిత్రాన్ని నిర్మిస్తోంది. టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య, సాయిపల్లవి జంటగా విజయ్ దర్శకత్వంలో ‘కణం’ మూవీ తెరకెక్కుతుంది. ‘2.0’ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్న నిరవ్‌షా ఈ చిత్రానికి పనిచేయడం విశేషం. ఈ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తారట. ఈ సినిమాకి నాగశౌర్య, సాయిపల్లవి, ప్రియదర్శి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఏఎల్ విజయ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రంతో సాయిపల్లవి కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. తల్లీకూతుళ్ల మధ్య అనుబంధం నేపథ్యంలో కణం తెరకెక్కుతున్నది. ఈ మూవీలో సాయిపల్లవి నాలుగేళ్ల కూతురికి తల్లి పాత్రలో నటిస్తోందట. హర్రర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నారు. తమిళ్‌లో కరు టైటిల్‌తో రిలీజ్ కానుంది. ఇక్కడ చెప్పుకోదగిన విశేషం ఏమిటంటే..

Sai Pallavi Becomes Mother In Kanam Movie

తన ప్రత్యేకతను, నటనాభినయాన్ని మాత్రమే చూపించడానికి ఇష్టపడే సాయి పల్లవి తల్లి పాత్రలో కూడా నటించేందుకు వెనుకాడడంలేదు. వాస్తవానికి పెళ్లి కాని హీరోయిన్లు తల్లి పాత్రలు అసలే చేయరు. అలా చేస్తే తమ తదుపరి చిత్రాల్లో పారితోషికాలు, అవకాశాలు సన్నగిల్లుతాయని భయపడతారు. కాని రెమ్యునరేషన్, గ్లామర్ రోల్స్ కంటే తాను చేయబోయే క్యారెక్టర్ కు ఉండే ఇంపార్టెన్స్ మాత్రమే చూసే సాయి పల్లవి మిగిలిన వారందరికీ భిన్నంగా పోతోంది. అవును ఆమెకు సమ్ థింగ్ స్పెషల్ చూపించాలన్న తపన ఉండబట్టే తెలంగాణ అమ్మాయిగా ‘ఫిదా’ సినిమాచేసి తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. మూసకొట్టుడు, నాటు డైలాగులు ప్లేస్ లో డిఫరెంట్ స్టోరీ పిక్చర్స్ రావాలని, సాయి పల్లవి వంటి ఆర్టిస్టులను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుందాం..

Share.

Comments are closed.