భార్యపై శోభనం గదిలో అమానుషంగా ప్రవర్తించిన టీచర్ రాజేశ్ ను టీచర్ విధుల నుంచి తప్పించారు.. అంతేకాదు అతడికి పుంసత్వ పరీక్షలు నిర్వహించి అసలు దాంపత్య జీవితానికి పనికొస్తాడో లేదో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు కోర్టు పర్మిషన్ కోరారు. తిరుపతి స్విమ్స్ లో రాజేశ్ కు ఈ పరీక్ష చేయనున్నారు. శోభనం గదిలో టీచర్ రాజేష్ తన భార్య పట్ల అత్యంత అమానుషంగా వ్యవహరించడానికి ముందు చాలా తతంగమే నడిచింది. అతను సంసారానికి పనికి రాడని కొద్ది నిమిషాల్లోనే భార్య గుర్తించిన విషయం తెలిసిందే… వెంటనే అమ్మాయి అదే సంగతిని తన కుటుంబ పెద్దలకు తెలిపింది.
వారు రాజేష్ తల్లిదండ్రులకు విషయం చెప్పారు. అది తెలిసి రాజేష్‌కు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు వధువు తండ్రి శతవిధాలా ప్రయత్నించాడు. ఆ తర్వాత సరే అంటూ ధైర్యం నటిస్తూ లోపలకి వెళ్లిన రాజేష్ తన అసలు రూపాన్ని ప్రదర్శించాడు.తాను సంసారానికి పనికిరానని భార్య శైలజ ముందు అంగీకరించాడు.. అంతేకాదు సభ్య సమాజం సిగ్గుతో తలదించేలాంటి అతి దారుణమైన ప్రతిపాదన చేశాడు. సంసారానికి పనికిరాని తనలాంటివాళ్లు ఎంతో మంది వివాహాలు చేసుకుంటున్నారని శైలజతో రాజేష్ చెప్పాడు. తనకు భార్యగా ఉంటూ కాపురం ఎవరితోనైనా చేసుకోవాలనే సభ్య సమాజం చీదరించుకునే ప్రతిపాధనను ఆ నవ వధువు ముందు ఉంచాడు. తాను సంసారానికి పనికి రాననే విషయాన్ని ఎవరికీ చెప్పకూడదని వేడుకున్నాడు.
దానికి ఆమె అంగీకరించకపోవడంతో సైకోగా మారాడని అంటున్నారు. ప్రస్తుతం స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నశైలజ క్రమంగా కోలుకుంటోంది. భర్త ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావడంతో జీవితం హ్యాపీగా సాగిపోతుందని భావించిన శైలజకు తీవ్రమైన ఎదురుదెబ్బ తగిలింది. భర్త మొహంపై పిడిగుద్దులు గుద్ది చిత్రవధ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 1వ తేది శుక్రవారం తెల్లవారుజామున శైలజకు రాజేష్‌కు మధ్య వివాహం జరిగింది. అదే రోజు రాత్రి వధువు ఇంట్లో శోభనం ఏర్పాటు చేయగా ఈ దారుణం చోటు చేసుకుంది. భార్యపై అత్యంత రాక్షసపూరితంగా ప్రవర్తించిన రాజేశ్ ను టీచర్ విధుల నుంచి తప్పించడమే కాదు అతడి తండ్రి తో సహా అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు.