ఘోర రోడ్డు ప్రమాదం.. హెల్మెట్‌లోనే ఇరుక్కుపోయిన తల

0

road accident bike rtc bus crash in vijayanagaram

విజయనగరం జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

వాహనదారుడు హెల్మెట్ పెట్టుకున్నా ఉపయోగం లేకపోయింది. బస్సు బంపర్‌కు- రోడ్డుకు మధ్య రాపిడిలో వాహనదారుడి తల- మొండెం వేరయ్యాయి. తల భాగం హెల్మెట్‌లోనే చిక్కుకుపోయింది. మొండెం మాత్రం బస్సు కింద ఉండిపోయింది.

ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి పేరు రాంబాబు అని, అతడిది బలిజపేట మండలం నూకలవాడ గ్రామం అని పోలీసులు నిర్ధారించారు. బస్సు విశాఖపట్టణం నుంచి పార్వతీపురం వెళుండగా విజయనగరం జిల్లాలోని గొట్టాం దగ్గరం ఈ దారుణం జరిగింది.

Share.

Comments are closed.