రారండోయ్ వేడుక చూద్దాం సినిమా టైటిల్ సాంగ్ విడుదల..!

0

rarandoy-title-songస‌మంత‌ను మ‌రి కొద్ది నెలల్లో పెళ్లి చేసుకోనున్న హీరో అక్కినేని నాగచైత‌న్య ప్ర‌స్తుతం త‌న సినిమాల జోరు పెంచాడు. చాలా వేగంగా సినిమాల‌ను కంప్లీట్ చేసే ప‌నిలో ప‌డ్డాడు. అందులో భాగంగానే త‌మ‌ సొంత సంస్థ అయిన అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై రారండోయ్ వేడుక చూద్దాం అనే సినిమాను శ‌ర‌వేగంగా తెర‌కెక్కించారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. అయితే ఈ సినిమాకు గాను ఓ పాట‌ను తాజాగా విడుద‌ల చేశారు.

రారండోయ్ వేడుక చూద్దాం పేరిట టైటిల్ సాంగ్‌ను ఈ సినిమా యూనిట్ విడుద‌ల చేసింది. గ‌త కొద్ది నెల‌లుగా టాలీవుడ్‌లో చాలా మ‌టుకు సినీ నిర్మాత‌లు ఆడియో రిలీజ్ వేడుక లేకుండానే ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ల‌ను ఏర్పాటు చేస్తున్నారు. అందులోనే పాట‌ల‌ను విడుద‌ల చేస్తున్నారు. అయితే అప్ప‌టికే వారానికో పాట చొప్పున విడుద‌ల చేస్తూ సినిమా ప‌బ్లిసిటీ ఏ మాత్రం త‌గ్గ‌కుండా చూసుకుంటున్నారు. దీన్ని ఫాలో అవుతూనే రారండోయ్ వేడుక చూద్దాం యూనిట్ స‌భ్యులు కూడా చిత్రానికి చెందిన టైటిల్ సాంగ్‌ను యూట్యూబ్‌లో లాంచ్ చేశారు.

ఈ సినిమాలో నాగ‌చైత‌న్య ప‌క్క‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా ఈ సినిమాను అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్ర‌సాద్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు. త్వ‌ర‌లో ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. రారండోయ్ వేడుక చూద్దాం టైటిల్ సాంగ్‌ను మీరూ కింద విన‌వ‌చ్చు..!

Share.

Comments are closed.