సాహో.. ప్ర‌భాస్‌..

0
Prabhas saaho first look poster revealed

Prabhas saaho first look poster revealed

తెలుగు అభిమానుల డార్లింగ్‌, వెండితెర బాహుబ‌లి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా.. సాహో చిత్ర యూనిట్ ఈరోజు సాహో ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసింది.

ముఖం కనిపించకుండా కర్చీఫ్‌ కట్టుకొని, ఓ చేతిని కోటు జేబులో పెట్టుకోని, మ‌రో చేత్తో ఫోన్ మాట్లాడుకుంటూ బ్లాక్‌డ్రెస్‌లో స్టైల్‌గా న‌డుచుకుంటూ వ‌స్తున్న సాహో ఫ‌స్ట్‌లుక్ అద్దిరిపోయింది. బాహుబలి స‌క్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న ప్ర‌భాస్‌కి సాహో అంత‌కంటే భారీ హిట్ అయ్యేలా ఈ సినిమా తెర‌కెక్కిస్తున్నారు.

యూవీ క్రియేష‌న్స్ ఈ సినిమాను నిర్మిస్తున్న‌ది. సుజీత్ డైరెక్ష‌న్ చేస్తున్న సాహో టీజ‌ర్లో ఇట్స్ షూటింగ్ అంటూ అంద‌రినీ ఆక‌ట్టుకున్న ప్ర‌భాస్ ఇప్పుడు స్టైలిష్ ఫ‌స్ట్‌లుక్‌తో అంచ‌నాలు పెంచేశాడు. తెలుగుతో పాటు త‌మిళం, హిందీ భాష‌ల్లో కూడా సాహో సినిమాను రిలీజ్ చేయ‌నున్నాడు.
ఇదే ప్ర‌భాస్ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసిన సాహో ఫ‌స్ట్ లుక్ లింక్‌.

Share.

Comments are closed.