స్వాతి ప్రియుడు రాజేష్ ను అరెస్టు చేయాలంటే రూ.2లక్షలు కావాలి.. ఎందుకో తెలుసా?

0

police facing problem in Swathi Lover rajesh arrest due to hospital billరాజేష్… వారం రోజులుగా తెలుగు మీడియాలో ఎడతెరిపి లేకుండా నానుతున్న పేరు. ప్రియురాలు స్వాతిపై ఉన్న మోజుతో, ఆమెతో కలసి ప్లాన్ చేసి.. ఆమె భర్త సుధాకర్ రెడ్డిని దారుణంగా హత్య చేశారు. ఇంతవరకూ రొటీన్ క్రైం స్టీరీనే.. కాని ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా మాదిరి సుధాకర్ రెడ్డి ప్లేస్ లోకి ఈ దొంగ మొగుణ్ణి తీసుకురావాలని ఆ నయవంచకురాలు చేసిన ప్రయత్నంతో దేశ వ్యాప్తంగా సంచలనమైంది. ఆపై తనకు తానుగా యాసిడ్ దాడి జరిగినట్టు డ్రామా ఆడి, హాస్పిటల్ లో సుధాకర్ గా చేరిన వ్యక్తి. విషయం మొత్తం బయటపడగా, ఆయన్ను ఏ క్షణమైనా అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు. గత నెల 26న ప్రియుడితో కలిసి భర్త సుధాకర్ రెడ్డి ని హత్యచేసిన స్వాతి గురించి వినే ఉంటారు. అయితే భర్తను హత్యచేసిన తర్వాత ప్రియుడు రాజేష్ పై యాసిడ్ పోసి చికిత్స నిమిత్తం గత నెల 28న జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చేర్చిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత అతడిని మరో ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం స్వాతి ప్రియుడు సుధాకర్ రెడ్డి హత్యలో బాగస్తుడైన రాజేష్ కోలుకున్నాడు. ఇక్కడే అసలు సమస్య వచ్చిపడింది. అతడి వైద్యానికి అయిన బిల్లు మంగళవారానికి 3.45 లక్షలు అయిందట. ఇందులో 1 లక్ష 80వేలు రాజేష్ ను తమ కుమారుడిగా పొరపాటుపడి సుధాకర్ రెడ్డి తల్లి దండ్రులు చెల్లించారు. ఇక మిగిలిన డబ్బు కడితేనే అతడిని డిశ్చార్జ్ చేస్తామని ఆసుపత్రి వర్గాలు తేల్చి చెప్పాయి. సోమవారం ఆసుపత్రినుండి బయటకు రావలసిన రాజేష్ డబ్బు కట్టకపోవడంతో బయటకు రాలేక పోయాడు. రాజేష్ తప్పించుకుంటాడనే ఉద్దేశ్యంతో 5 గురు కానిస్టేబుల్స్ ఒక ఎస్ఐ తో బందోబస్తు ఏర్పాటు చేశారు.police facing problem in Swathi Lover rajesh arrest due to hospital bill

అయితే ఈ కేసులో సుధాకర్ రెడ్డి భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే రాజేశ్ ను అరెస్టు చేయాలంటే పోలీసులకు రూ.2లక్షల డబ్బులు కావాల్సి వచ్చింది. ఆ డబ్బేమో డిపార్టుమెంటు ఇవ్వదు. మరీ ఆ డబ్బంటూ లేకపోతే కేసు ముందుకు సాగదు. దీంతో నాగర్ కర్నూలు పోలీసులు తలపట్టుకుని కూర్చున్నారు. అసలు ఈ 2లక్షల కథేమిటో తెలుసుకునేందుకు కింది వీడియో క్లిక్ చేయండి..

 

Share.

Comments are closed.