సైరా నరసింహారెడ్డి పవన్ కళ్యాణ్ నటించనున్నారా ?

0

pawan kalyan acting In saira narasimha reddy Movie
తొలి భారతీయ స్వాతంత్ర సమర యోధుడు రేనాటి సూర్యుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవితం ఆధారంగా రూపుదిద్దుకోనున్న సైరా నరసింహారెడ్డి సినిమా పనులు జోరందుకున్నాయి. మెగాస్టార్ చిరంజీవి గుర్రపు స్వారీ, కత్తి విన్యాసాల్లో శిక్షణ తీసుకుంటున్నారు. ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ హైదరాబాదలోని నానక్ రామ్ గూడా స్టూడియోస్ లో 1840 ల నాటి వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.

ఈ పనులు పూర్తి కావచ్చాయి. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ లో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సినిమా రారాజు అమితాబ్ బచ్చన్, డేరింగ్ స్టార్ జగపతి బాబు, కన్నడ స్టార్ కిచ్చ సుదీప్, విజయ్ సేతు పతి లు కీలక పాత్రలు పోషించనున్నారు.వారితో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా నటించనున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. సినిమాలో పది నిముషాలపాటు కనిపించే ఈ రోల్ చాల పవర్ ఫుల్ గా ఉంటుందని..

ఆరోల్ పవన్ చేస్తే బాగుంటుందని డైరక్టర్ సురేందర్ రెడ్డి కోరడంతో తమ్ముడిని చిరంజీవి ఒప్పించినట్లు సమాచారం. భారీ తారాగణంతో, అత్యంత సాంకేతిక నైపుణ్యంతో రూపుదిద్దుకోనున్న ఈ మూవీ వచ్చే నెలలో సెట్స్ మీదకు వెళ్లనుంది. 2019 సంక్రాంతికి థియేటర్ లోకి రానుంది.

Share.

Comments are closed.