ఆమె వీపు బాగుంది : ఆర్జీవీ

0

లక్ష్మీపార్వ‌తి జీవితంలో జ‌రిగిన ఘ‌ట్టాలు, ఆమె ఎన్టీఆర్ జీవితంలోకి ప్ర‌వేశించిన సంద‌ర్భాల గురించి కేతిరెడ్డి జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి ఓ సినిమా తీస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఆ సినిమా పేరు ల‌క్ష్మీస్ వీర‌గ్రంథం. ఈ చిత్ర ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల చేశారు. అంద‌మైన అమ్మాయి వీపు చూపిస్తూ నిల్చున్న ఆ ఫొటోను చూసి ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీస్తున్న ఆర్జీవీ ట్విట్ట‌ర్‌లో ఓ కామెంట్ చేశారు. ల‌క్ష్మీస్ వీర‌గ్రంథం ఫ‌స్ట్‌లుక్‌ని ఉద్దేశించి ఆమె ఎవ‌రో నాకు తెలియ‌దు కానీ.. ఆమె వీపు మాత్రం చాలా బాగుంది అని ట్వీటాడు. త‌మిళ‌నాడు తెలుగు యువ‌శ‌క్తి అధ్య‌క్షుడు కేతిరెడ్డి జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి ఈ ల‌క్ష్మీస్ వీర‌గ్రంథం సినిమాను తెర‌కెక్కిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

‘ఎన్టీఆర్ జీవితంలో మొదటి భాగం, ఆఖరి భాగం కాకుండా ఆ మధ్యలో జరిగిన విషయాలను తెరకెక్కిస్తా. ఈ విషయాలు ప్రజలకు తెలియవు. లక్ష్మీపార్వతి మొదటి భర్త వీరగంధం సుబ్బారావుగారు హరికథలు చెప్పుకునేందుకు వాడవాడలా తిరిగారు. ఇక ఎన్టీఆర్ రెండో భార్యగా ఆయన జీవితంలోకి లక్ష్మీపార్వతి ఎలా ప్రవేశించారన్న విషయం ప్రజలకు తెలియాల్సి ఉంది. తిరుపతిలోని వెంకన్న సన్నిధిలో ప్రారంభోత్సవం చేసి, నవంబర్ రెండో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం.

 

one more bio pic on ntr

one more bio pic on ntr

 

ఈ చిత్రంలో లక్ష్మీ పార్వతి పాత్రను నటి వాణీవిశ్వనాథ్‌ పోషించే అవకాశం ఉన్నట్టు తెలిపారు. ఈ చిత్రంలో హీరో ఎవరనేది త్వరలో నిర్ణయిస్తామన్నారు. లక్ష్మీ పార్వతి తన మొదటి భర్త వీరగంధం సుబ్బారావుని వదిలి సూట్ కేస్‌తో బయటకు రావడంతో సినిమా మొదలై, ఎన్టీఆర్ జీవితంలోకి ఆమె ప్రవేశించడంతో ఈ సినిమా ముగుస్తుంది. ఈ చిత్రంలో మూడు పాటలు, హరికథతో పాటు కొన్ని శ్లోకాలు కూడా ఉంటాయన్నారు. 2018లో లక్ష్మీస్ వీరగంధం సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం’ అని జగదీశ్వర్ రెడ్డి వివరించారు.

 

one more bio pic on ntr

one more bio pic on ntr akshmis veeragrandham

Share.

Comments are closed.