యువ‌కుడిని చిక్కుల్లో ప‌డేసిన రాధిక‌!

0

One Guy Faced Problem With Actress Radhika

అక్కడికి నా కొడుకుని.. లక్కీని తీసుకుని వస్తా..అంటూ విలన్ కి ఛాలేంజ్ చేసి.. ఏయ్ పెద్దాయన ఇది నా వాట్సప్ నంబర్ నోట్ చేసుకో అని ర‌వితేజ న‌టించిన రాజా ది గ్రేట్ సినిమాలో డైలాగ్ గుర్తుందా? ఆ డైలాగ్‌కి ఈల‌లు, చ‌ప్ప‌ట్ల‌తో హాలంతా ద‌ద్ద‌రిల్లిపోయింది కూడా! అయితే ఆ డైలాగులో చెప్పిన  80745 45422 అనే నంబ‌రు  విశాఖ జిల్లాకు చెందిన ఓ యువ‌కుడిది. సినిమాలో రాధిక చెప్పిన ఈ నంబ‌రు వ‌ల్ల ఆ కుర్రాడు నానా ఇబ్బందులు ప‌డుతున్నాడు. ఈ ఫొటోలోని కుర్రాడే అత‌డు. పేరు గోపి. అత‌ని బాధ అత‌డి మాట‌ల్లోనే..

‘‘నా పేరు లంకలపల్లి గోపి. మాది విశాఖ జిల్లా ఆనందపురం గ్రామం. వృత్తిరీత్యా వడ్రంగి అయిన నేను నిన్నమొన్నటి వరకూ ఎంతో ప్రశాంతంగా బతికేవాడిని. అయితే ‘రాజా ది గ్రేట్‌’ సినిమా రిలీజైన నాటినుంచి నాకు కష్టాలు మొదలయ్యాయి. ఈ సినిమాలో విలన్‌ను ఉద్దేశించి హీరో తల్లి రాధిక… ‘‘ఇదిగో నా  ఫోన్‌ నంబరు. టైం,ప్లేస్ డిసైడ్ చేసి లొకేషన్ సెండ్ చేయ్’ అని సవాల్‌ చేస్తుంది. ఈ సందర్భంగా ఆమె చెప్పిన నంబరు 80745 45422 నాదే. అయితే అది నిజంగానే రవితేజ ఫోన్‌ నంబరు అనుకున్న అభిమానులు నాకు తెగ ఫోన్లు చేసేస్తున్నారు.

ప‌ని మానుకుని మరీ ఆ నంబర్‌ రవితేజది కాదు, నాది అని చెప్పుకోవాల్సి వస్తోంది. ఒకటి, రెండు కాల్స్‌ అయితే ఫర్వాలేదు.. కానీ మరీ వేలల్లో వచ్చే కాల్స్‌కు సమాధానం చెప్పడం కష్టంగా ఉంది. ఈ బాధ తట్టుకోలేక ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసి, నాకు అవసరమైనప్పుడే ఆన్‌ చేసుకుంటున్నా. అభిమానులకు నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే… దయచేసి ఈ నంబరుకు ఫోన్‌ చేయొద్దు…! అసలు నా అనుమతి లేకుండా నా ఫోన్‌ నంబర్‌ను  వినియోగించు కున్నందుకు ‘రాజా ది గ్రేట్  సినిమా డైరెక్టర్‌పై కేసు పెడుదామ‌నుకుంటున్నా!

ఇట్లు,
లంకలపల్లి గోపి, ఆనందపురం(విశాఖ జిల్లా).

Share.

Comments are closed.