చనిపోయిన యువకుడు లేచి కూర్చున్నాడు.. అత‌డు ఏం చెప్పాడో వింటే మీరు షాకే!!

0

మీరెప్పుడైనా స్వర్గం చూశారా? మరి నరకం? అయినా ఏది చూడాలన్నా ముందుగా ‘పోవాలి’ కదా! పోయాక ఇక జవాబు చెప్పడం ఎక్కడ కుదిరి చస్తుంది! అసలు చచ్చి బతికినవాళ్లూ ఉంటారా? ఉన్నారు(ట)! నమ్మేదెలా..? నిజమే.. కొన్ని గాథల్ని నమ్మలేం. కొన్ని మాత్రం కొంచెం భలే నమ్మాలనిపించేలా ఉంటాయి. పుట్టిన వాడికి మరణం తప్పదు. మరణించిన వాడికి జననం తప్పదు. అనివార్యమైన ఈ విషయము గూర్చి శోకించడం వలదు… ఏ కొద్ది మంది నాస్తికులో తప్ప దాదాపు ఆస్తికులందరూ ఈ మాటను విశ్వసిస్తారు. జన్మలూ, పునర్జన్మలూ, కర్మఫలాలూ ఉన్నాయనీ, ఆత్మలకు నాశనం లేదనీ నమ్ముతారు. ఒకటి స్వయంగా అనుభవించడం. లేదా అనుభవించి వచ్చినవారు చెబితే తెలుసుకోవడం.. అటువంటి ఇంట్రెస్టింట్ ఘటనలే ఇవి..

చనిపోయినవారు ఈ మధ్య స్మశాన వాటిక దగ్గరికి వెళ్లే సరికి లేచి కూర్చుంటూ అందరినీ పరుగులు పెట్టిస్తున్నారు.. ఇక బంధువులు మాత్రం మళ్లీ తిరిగివచ్చాడని సంతోష పడుతున్నారు. తాజాగా ధార్వాడ్ లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. కుమార్ మారేవాడ్ అనే 17 అబ్బాయికి నెల క్రితం ఓ వీధి కుక్క కరిచింది. ధార్వాడ్ లోని ఓ ఆసుపత్రి లో చేర్చారు. అతడి పరిస్థితి బాగా విషమంగా ఉందని, వెంటిలేటర్ తీస్తే ఇక బతకడని వైద్యులు చెప్పడం తో చేసేది లేక ఇంటికి తీసుకొచ్చారు. కొద్ది సేపటికే అతడు గాలి తీసుకోవడం మానేసాడు. చేతులు, కాళ్ళు చల్లబడ్డాయి. చనిపోయాడని భావించిన బంధువులు అతడిని స్మశానానికి తీసుకెళ్తున్నారు. ఇంకొద్ది దూరంలో స్మశానం వస్తుందనగా అతడు సడెన్ గా లేచి కూర్చున్నాడు. అంతే ఒక్కసారిగా అందరు షాక్ అయ్యారు. ఆ వెంటనే మరో ఆసుపత్రి కి తీసుకెళ్లగా కుక్క కాటు వల్ల ఆ తరహా ఇన్ఫెక్షన్ వస్తుందని డాక్టర్స్ చెప్పి అతడికి వైద్యం మొదలు పెట్టారు.

దుర్గా జాతవ్ 20 ఏళ్ల వయసులో టైఫాయిడ్ వల్ల తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఆస్పత్రిలో దేహం చలనం కోల్పోవడంతో అందరూ అతడు చనిపోయాడని భావించారు. కానీ రెండు గంటల తర్వాత లేచి కూర్చున్నాడు. ఈ లోపు జరిగిందిది..‘‘నన్ను ఓ పదిమంది వచ్చి ఎక్కడికో తీసుకుపోయారు. పారిపోవడానికి ప్రయత్నించడంతో మోకాళ్ల వరకూ కాళ్లు నరికేశారు. 40, 50 మంది కూర్చున్న ఓ చోటికి వారు నన్ను తీసుకెళ్లగానే ఓ వ్యక్తి కాగితాలు చూస్తూ.. జాబితాలో నా పేరు లేదని చెప్పాడు. ‘ఇతడినెందుకు తెచ్చారు? వెనక్కి పంపండి’ అన్నాడు. కాళ్లు లేకుండా ఎలా వెళతానని అడగడంతో కొన్ని జతల కాళ్లను తీసుకొచ్చారు. వాటిలో నా కాళ్లను మళ్లీ నాకు చేతులతోనే అమర్చారు. తర్వాత వెనక్కి పంపేశారు’’ అని దుర్గా జాతవ్ వివరించాడు.

అతడి మోకాళ్ల దగ్గర అంతకుముందెన్నడూ లేని కుట్టేసిన గుర్తులు ఉండటమే అతడు నరకానికి వెళ్లొచ్చాడనడానికి సాక్ష్యాలుగా అందరూ చెప్పుకున్నారు. 1979లో ఈ అనుభవం పొందిన దుర్గాను ఆ తర్వాత సత్వంత్ పస్రీచా, ఇయాన్‌స్టీవెన్సన్‌లు ఇంటర్వ్యూ చేశారు. పక్కసందులోనే ఉన్నట్లు రెప్పపాటులోనే స్వర్గం అంచులదాకా లేదా నరకంలోకి వెళ్లడం ఎలా సాధ్యం? ఇదంతా మాయా? లేక నిజ్జంగానే నిజమా! ఏదేమైనా..నమ్మశక్యమైన కొందరి మరణానుభవాలను చూస్తే మాత్రం.. మరణం మహాద్భుతం అని అనిపిస్తుంది. మరణం అంటే ఆనందం. మరణం అంటే అమరత్వం. స్వర్గం అంటే అంతులేని సంతోషం అనిపిస్తుంది. అయితే మరణం అనేది సహజంగా రావాలి. మృత్యు ఒడిలోకి జారుకుని ఆనందసాగరాల అంచులు చేరాలి. అప్పటి వరకు న్యాయంగా, ధర్మంగా నలుగురు మెచ్చేలా బతకాలి. అలా బతికి చనిపోయాక ఏం జరిగితే మనకేంటి.. అయినా మంచి వాళ్లు స్వర్గానికి వెళతారనేగా ఏ మత గ్రంథమయినా చెప్పేది.

 

Share.

Comments are closed.