ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా ఆగిపోయిందట.. కారణం ఇదే !

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో సినిమా అనగానే నందమూరి, మెగా, ఇతర సినీ అభిమానుల్లో ఓ క్రేజ్ ఏర్పడింది. ఆ తర్వాత ఏకంగా పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ తెరపైకి వచ్చి క్లాప్ కొట్టడంతో క్రేజ్ మరింత పెరిగింది. సినిమా పరిశ్రమలో ఆరోగ్యకరమైన వాతావరణానికి వారి సినిమా ఓ బాటను వేస్తున్నదనే అభిప్రాయం వినిపించింది. అయితే ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా ఆగిపోయిందనే ఓ నిరాధార వార్త సినీ వర్గాల్లో వైరల్ అవుతున్నది.

ntr trivikram movie has stopped

అయితే అటు ఎన్టీఆర్ వర్గం నుంచి గానీ, త్రివిక్రమ్ సర్కిల్ నుంచి ఎలాంటి ప్రకటన లేకపోవడం, ఎవరూ స్పందించకపోవడంతో ఆ వార్త రూమారా లేదా వాస్తవమేనా అనే సందిగ్ధత మధ్య కొట్టుమిట్టాడుతున్నది. సొంత సినిమా ప్రారంభోత్సవాలకు ఆమడదూరంలో ఉండే పవన్, ఏకంగా ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా ఓపెనింగ్‌కు ముఖ్య అతిథిగా హాజరై ఓపెనింగ్ షాట్‌కు క్లాప్ కొట్టడం, ఎన్టీఆర్ ఫ్యామిలీతో పవన్ అన్యోన్యంగా మాట్లాడడం ఇరు వర్గాల ఫ్యాన్స్‌ను ఆనందంలో ముంచెత్తాయి. కానీ ఆ సినిమా ఓపెనింగ్ తర్వాత.. ఎన్టీఆర్, త్రివిక్రమ్ మధ్య ఏవో క్రియేటివ్ విభేదాలు వచ్చాయి.

ప్రస్తుతం ఎన్టీఆర్ ఆ సినిమా చేయడం లేదు వచ్చాయి. కానీ గత రెండు మూడు రోజుల వ్యవధిలో ఆ వార్తకు బలం చేకూరుస్తూ.. ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది అనే విషయం సినీవర్గాల్లో చర్చనీయాంశమవుతున్నది. దర్శకుడు కొరటాల శివతో ఎన్టీఆర్ భద్రాది పర్యటన తర్వాత ఈ చర్చ మరింత ఊపందుకొన్నది. ఇదిలా ఉండగా, పవన్ కల్యాణ్‌తో చేస్తున్న సినిమా జనవరి రెండో వారంలో విడుదలకు సిద్ధమవుతున్నది. అప్పటివరకు మరో సినిమా త్రివిక్రమ్ చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఎన్టీఆర్ కొరటాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తున్నది

 

Share.

Comments are closed.