ఆ సూప్ వల్లే స్వాతి గుట్టు ఎలా బ‌య‌ట‌ప‌డిందో తెలుసా..!

0

new twist in nagar kurnool sudhakar reddy murder caseవివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ప్రియుడి సాయంతో హత్యచేసిన నాగర్ కర్నూల్ మహిళ స్వాతి గురించి తెలిసిందే. భర్త సుధాకర్ రెడ్డిని హతమార్చడమే కాకుండా ప్రియుడికి ప్లాస్టిక్ సర్జరీ చేయించి భర్త స్థానంలోకి అతడిని తీసుకురావాలని పథకం వేసింది. కానీ అనూహ్యంగా గుట్టు బయటపడటంతో అడ్డంగా దొరికిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కాంట్రాక్టర్‌ సుధాకర్ రెడ్డి హత్య కేసులో మరో కొత్త ట్విస్ట్ బయటపడింది. ఈకేసులో ప్రధాన నిందితుడు రాజేశ్‌ను మటన్‌ సూప్‌ అడ్డంగా పట్టించింది. యాసిడ్‌ దాడిలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నది తమ కుమారుడు సుధాకర్ రెడ్డి కాదని ఆది నుంచి అతడి కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. వారి అనుమానానికి పక్కా ఆధారాలు దొరికాయి. ఆస్పత్రిలో అతడి మాటలపై అనుమానం వచ్చినా.. మటన్‌ సూప్‌‌తో మాత్రం అతడు తమకు కుమారుడు కాదని పక్కాగా నిర్ధరణ అయ్యింది.మృతుడు సుధాకర్‌ రెడ్డి‌కి నాన్‌ వెజ్‌ అంటే చాలా ఇష్టం.

అయితే ముఖంపై పెట్రోలు పోసుకుని సుధాకర్ పేరుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజేశ్‌ మాత్రం పూర్తి శాకాహారి. అయితే కాలిన గాయాలతో ఉన్నవారికి మటన్ సూప్ అందిస్తే త్వరగా నయమవుతుందని సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు రాజేశ్‌కు అందజేస్తే, దానిని తాగేందుకు అతడు నిరాకరించాడు. మాంసాహారాన్ని అమితంగా ఇష్టపడే తమ కొడుకు సూప్ తాగనని ఆస్పత్రి సిబ్బందికి చెప్పడంతో సుధాకర్‌ రెడ్డి కుటుంబీకులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. తమ అనుమానాలతోపాటు మటన్ సూప్ కూడా తోడువడంతో.. గాయాలతో చికిత్స పొందుతున్నది సుధాకర్ కాదని కుటుంబ సభ్యులు నిర్థరించుకున్నారు. దీంతో నాగర్ కర్నూలు పోలీసులకు వారు ఫిర్యాదు చేయడంతో రంగంలో దిగారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

new twist in nagar kurnool sudhakar reddy murder case

నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన సుధాకర్ రెడ్డి, స్వాతిలు ఏడేళ్ల కిందట ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. గతంలో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేసిన సుధాకర్‌ మూడేళ్ల కిందట నాగర్ కర్నూల్‌కు వచ్చి స్థిరపడ్డారు. వ్యాపారం విషయాలతో తీరికలేకుండా సుధాకర్‌రెడ్డి తిరగడంతో భర్త తనను పట్టించుకోవడంలేదనే ఉద్దేశంతో స్వాతి అడ్డదారి తొక్కింది. రెండేళ్ల నుంచి నాగర్‌ కర్నూల్‌కు చెందిన ఫిజియోథెరపిస్ట్ రాజేశ్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. దీని గురించి ఇటీవల సుధాకర్ రెడ్డికి తెలియడంతో అతడిని హత్యచేయాలని పథకం వేసింది. ఇద్దరూ కలిసి సుధాకర్ రెడ్డిని హత్యచేసి కొత్త నాటకానికి తెరతీశారు.

Share.

Comments are closed.