మహేష్ బాబు స్పైడర్ మూవీ టీజర్ రిలీజ్‌

0
412

Mahesh Babu Spyder Movie Official Teaserమహేష్‌బాబు, దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం స్పైడర్. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ ఇవాళ విడుదలైంది. ఈ సినిమాలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ కథానాయికగా నటిస్తోంది. నిన్న సాయంత్రం 5గంటలకే టీజర్ విడుదల కావాల్సి ఉన్నప్పటికీ.. దాసరి మరణంతో వాయిదా పడింది. ఇక సినిమా కూడా తొలుత జులైలో విడుదలవుతుందని అందరూ భావించారు.

కానీ కొన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ చిత్ర విడుదలను దసరాకు వాయిదా వేశారు. దసరాకు ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు మహేష్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించాడు.అయితే రిలీజ్ కొంత ఆలస్యమైనప్పటికీ సినిమా కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 30న విడుదల కాబోతోంది. ఫ్యాన్స్‌కు సంతోషం కలిగించే మరో విషయమేంటంటే ఈసారి మరోసారి సంక్రాంతి బరిలో మహేష్ నిలవబోతున్నాడు. శ్రీమంతుడు లాంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన కొరటాల శివ, సూపర్ హిట్ ట్యూన్స్ అందించిన దేవీశ్రీప్రసాద్ మహేష్‌‌కు మరో హిట్ ఇవ్వడం ఖాయం అని సినీ జనం చర్చించుకుంటున్నారు. అంటే స్పైడర్ విడుదలైన నాలుగు నెలల్లోనే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భరత్ అను నేను’ విడుదల కాబోతుందనమాట.