బృందావ‌నం + మురారి = మ‌హేశ్ కొత్త సినిమా

0
mahesh babu new movie Updates

mahesh babu new movie Updates

ఈ మ‌ధ్య స్టార్ హీరోలంద‌రూ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన్ క‌థ‌ల వైపు దృష్టి పెట్టారు. ఈ సూత్రాన్ని ఫాలో అవుతూ ఆల్‌టైమ్ హిట్ట‌ర్‌గా పేరు తెచ్చుకుని విక్ట‌రీని ఇంటిపేరుగా మార్చుకున్న వెంక‌టేశ్‌ని ఇప్పుడు హీరోలంద‌రూ ఫాలో అవుతున్నారు.

ఎప్పుడూ మాస్‌, క‌మ‌ర్షియ్ సినిమాలు తీస్తే ఆ కోణానికి దూరంగా ఉండే ఫ్యామిలీ ప్రేక్ష‌కుల‌కు దూర‌మైపోతామ‌న్న ఆలోచ‌న‌లో ప‌డ్డారు హీరోలంద‌రూ. ఆ కోవ‌లోనే ఇప్పుడు మ‌హేశ్ బాబు త‌న నెక్ట్స్ సినిమాకు ఫ్యామిలీ డ్రామా క‌థ ఎంచుకున్నారు. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న భ‌ర‌త్ అను నేను సినిమా పూర్త‌యిన త‌ర్వాతే ఈ క‌థ ప‌ట్టాలెక్కుతుంది. ఈ క‌థలో కుటుంబంలో ఉన్న అనుబంధాల్ని, ఆప్యాయ‌త‌ల‌ను మ‌రోసారి ట‌చ్ చేయ‌నున్నార‌ట‌. బృందావ‌నంతో ఫ్యామిలీ క‌థ‌లు కూడా చేయ‌గ‌ల‌న‌ని నిరూపించుకున్న వంశీ పైడిప‌ల్లి మ‌రోసారి ఫ్యామిలీ క‌థ‌తో మ‌హేశ్‌బాబును హీరోగా కొత్త సినిమా తెర‌కెక్కించ‌నున్నాడు.

 

సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, మురారి లాంటి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన్ల‌తో హిట్ కొట్టిన మ‌హేశ్ బాబు కోసం బృందావ‌నం, మురారిల‌ను త‌ల‌పించే కొత్త క‌థ‌తో ఫ్యామిలీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నున్నాడు. జ‌యకృష్ణ ముకుందా మురారి అనే టైటిల్‌ని ఈ సినిమా కోసం ప‌రిశీలిస్తున్నార‌ట‌. దిల్‌రాజు, అశ్వ‌నీద‌త్‌లు క‌లిసి ఈ సినిమాను నిర్మించ‌నున్నారు. వ‌చ్చే ఏడాది మార్చిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది.

Share.

Comments are closed.