లావ‌ణ్య చూపించినా క‌ట్ చేశారు!

0
lawanya thripati bikini show In vunnadhi okate zindagi Movie

lawanya thripati bikini show In vunnadhi okate zindagi Movie

 

రామ్ హీరోగా నటించిన ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాలో.. ‘లై’ ఫేమ్ మేఘ ఆకాష్‌ని రీప్లేస్ చేసి ఛాన్స్ దక్కించుకున్న లావణ్య త్రిపాఠికి నిరాశే మిగిలింది. ఈ సినిమా కోసం బికినీ కూడా వేసిందట. పోటీ ఎక్కువ‌గా ఉండ‌టం, కెరీర్, ఛాన్సులు కూడా అంతంత మాత్రంగా ఉంటుండడంతో ఈ నిర్ణయం తీసుకుందట లావ‌ణ్య‌. ఎంతో ఇబ్బంది ప‌డి బికినీ ధ‌రించినా.. ఫస్ట్ కాపీ చూసిన తరువాత కంటెంట్‌కి ఆ బికినీ సీన్స్‌కి అస్సలు కుదరడంలేదని దర్శకనిర్మాతలు వాటిని ఎడిట్ చేశారట. దీంతో హ‌ర్ట్ అయిన లావణ్య.. సినిమా ప్రమోషన్స్‌పై కూడా ఇంట్రెస్ట్ చూపించడంలేదట‌. సినిమా కోసం చేసిన‌ గ్లామర్ షో వృథా అయింద‌న్న బాధలో ఆమె ఉన్నట్లుంది.

అయితే ఒకప్పడు హాలీవుడ్, బాలీవుడ్‌కి మాత్రమే పరిమితమైన బికినీ కల్చ‌ర్ టాలీవుడ్‌కి కూడా పాకింది. ఇలియానా, అనుష్క, ప్రియమణి, సమంత, నయనతార వంటి స్టార్ హీరోయిన్ల దగ్గర నుంచి శ్రద్ధాదాస్, సంజన, లక్ష్మీరాయ్ వంటి తారల వరకు అంతా బికినీల్లో అందాలు ధార‌పోశారు. ప్రస్తుతం ఇండస్ట్రీకి పరిచయమవుతున్న కొత్త హీరోయిన్లు కూడా బికినీలు వేసి కుర్రకారుని ఆకట్టుకోడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో లావ‌ణ్య అంద‌మంతా అడ‌వి కాచిన వెన్నెల అయింది పాపం..!

Share.

Comments are closed.