శివగామితో కట్టప్ప సరసాలు వీడియో చూశారా!

0

ఇది చ‌ద‌వ‌గానే శివ‌గామి ఏంటి? కట్టప్పతో రొమాన్స్ ఏంటి అన్న సందేహం రావ‌డం స‌హ‌జ‌మే. క‌ట్టు బానిస‌గా బాహుబ‌లిలో శివగామి ముందు మోక‌రిల్లే కట్టప్ప ఆమెతో రొమాన్స్ చేయ‌డం ఏంటి అన్న అనుమానం క‌లుగుతుంది.రాజమాత శివగామి దేవికి చీరలు కొని పెడుతూ భుజంపై చేయి వేసి మంచి రొమాంటిక్ మూడ్‌లో ఉన్నాడు. ఈ సీన్ చూస్తే అదేంటి కట్టప్పలో ఈ యాంగిల్ కూడా ఉందా? అన్న సందేహం రాక మానదు.

Kattappa Romancing Sivagami Video

అసలు విషయానికి వస్తే సత్యరాజ్ గత రెండేళ్లుగా పోతీస్ టెక్స్‌టైల్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే బాహుబలి సినిమాతో కట్టప్ప, శివగామి క్యారెక్టర్‌లు ప్రపంచ వ్యాప్తంగా మంచి పాపులారిటీ రావడంతో ఈ క్యారక్టర్స్‌‌నే భార్య భర్తలుగా చూపిస్తూ బాహుబలి స్టైల్‌ కాస్ట్యూమ్స్‌తో ఓ యాడ్‌ను రిలీజ్ చేశారు. ఇందులో సత్యరాజ్ రమ్యకృష్ణకు పోతీస్ వారి చీరను బహుకరిస్తూ చేసిన యాడ్ హాట్ టాపిక్‌గా మారడంతో ఈ అడ్వర్టైజ్‌మెంట్‌కు ఫుల్ పబ్లిసిటీ వచ్చేసింది. ఈ యాడ్‌పై మీరూ ఓ లుక్కేయండి.

 

Share.

Comments are closed.