ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ ఫస్టులుక్ రిలీజ్ !

0
497

NTR's Jai Lava Kusa Movie First Look Releasedఇక ఎన్టీఆర్ బర్తడే సంద్భంగా ”జై లవ కుశ” సినిమా తాలూకు ఫస్ట్ లుక్ ను ఈ రోజు రిలీజ్ చేశారు. అయితే ఫారిన్ మేకప్ ఆర్టిస్టుతో పనిచేస్తున్నారు కాబట్టి.. ఏదైన విలక్షణ లుక్ ను రిలీజ్ చేస్తారని అనుకుంటే.. కేవలం ఎన్టీఆర్ ను సంకెళ్ళు వేసి తీసుకెళ్తున్న జమిందార్ తరహాలో చూపించాడు దర్శకుడు బాబీ. ఈ లుక్ చూసి ఫ్యాన్స్ అందరూ రాయల్ లుక్ అంటూ ఆనందపడుతున్నారు కాని..

ఒక బ్యాడ్ సెంటిమెంట్ మాత్రం కాస్త భయపెడుతోంది. కొత్త హెయిర్ స్టైల్ తో .. కోరమీసంతో .. చెవి పై భాగంలో రింగ్ తో ఈ పోస్టర్స్ లో ఎన్టీఆర్ కనిపిస్తున్నాడు. ఒక పోస్టర్లో చేతికి గొలుసులు ఉండగానే ఆయన ప్రజలకి అభివాదం చేస్తున్నాడు. మరో పోస్టర్ లో స్టైల్ గా కారు దిగుతున్నాడు. ఈ రెండు పోస్టర్స్ నేపథ్యంలో రావణాసురుడి ప్రతిమ కనిపిస్తోంది. దీనిని బట్టి ఇది ఎన్టీఆర్ పోషిస్తోన్న నెగెటివ్ రోల్ కి సంబంధించిన లుక్ అని తెలుస్తోంది. గతంలో ఇలా మీసాలు తిప్పిన లుక్కులో కొన్ని ఘనమైన సినిమాల్లో కనిపించాడు.

అవే ఆంధ్రావాలా.. శక్తి.. దమ్ము. ఈ మూడు సినిమాలూ ఎన్టీఆర్ కెరియర్ లో డిజాష్టర్ కా బాప్స్ అని చెప్పాలి. ఆ సినిమాల్లో మనోడు మీసాలు తిప్పేసి.. సేమ్ టు సేమ్ ఇదే విధంగా కనిపిస్తాడు. మొత్తానికి ఈ లుక్ ఎన్టీఆర్ట్ ఫ్యాన్స్ ని మెప్పించేలా .. అదుర్స్ అనిపించేలా వుంది. రాశి ఖన్నా .. నివేదా థామస్ నటిస్తోన్న ఈ సినిమాలో, విలన్ గా దునియా విజయ్ కనిపించనున్నాడు.

NTR's Jai Lava Kusa Movie First Look Released