నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. ఈ నెల 25వ తేదీన ఈ-కామర్స్‌ జాబ్‌మేళా

0

job opportunity in e commerce

నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించే నిమిత్తం ట్రేడ్‌ హైదరాబాద్‌ డాట్‌కామ్‌ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీన ఈ-కామర్స్‌ మార్కెటింగ్‌ ఉద్యోగ మేళాను నిర్వహిస్తున్నట్లు సంస్థ సీవోవో శ్రీలత తెలిపారు.

మార్కెటింగ్‌, నెట్‌వర్కింగ్‌ మార్కెటింగ్‌, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌, టెలిమార్కెటింగ్‌, బిజినెస్‌ డెవల్‌పమెంట్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌ రంగాల్లో ఉన్న.. పలు ఉద్యోగ అవకాశాల కోసం డిగ్రీ లేదా ఎంబీఏ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ మేళాలో పాల్గొనవచ్చని చెప్పారు.

ఇంటర్వ్యూలో ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెలా రూ.24వేల నుంచి రూ.32వేల వరకు వేతనం, టీఏ, డీఏ, బిజినెస్‌ అలవెన్సులతో ఉద్యోగాల్లోకి తీసుకుంటామని ఆమె తెలిపారు. మరింత సమాచారం కోసం.. 7337556150 నంబర్‌లో సంప్రదించాలని శ్రీలత తెలిపారు.

Share.

Comments are closed.