అదిరిపోయే ప్లాన్‌ను తీసుకురానున్న జియో.. రూ.100కే అన్‌లిమిటెడ్ ప్యాక్స్‌..?

0

jio 100 planరిల‌య‌న్స్ జియో. త‌న వినియోగదారుల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త ఆఫ‌ర్ల‌ను అందిస్తూనే మ‌రో వైపు ఇత‌ర టెలికాం సంస్థ‌ల వెన్నుల్లో వ‌ణుకు పుట్టిస్తోంది. దీంతో ఇత‌ర సంస్థ‌లు కూడా త‌మ ద‌గ్గ‌ర ఉన్న ఖాతాదారులు జియో వైపు మ‌ళ్ల‌కుండా ఉండేందుకు గాను ఆఫ‌ర్ల‌ను ప్ర‌వేశ పెట్ట‌క త‌ప్ప‌డం లేదు. అయితే ఎవ‌రెన్ని ఆఫ‌ర్ల‌ను ప్ర‌వేశ పెట్టినా అవి జియో ఇస్తున్న వాటిలా లేవ‌ని చాలా మంది యూజ‌ర్లు బ‌హిరంగంగానే విమ‌ర్శిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇత‌ర సంస్థ‌ల‌కు జియో త‌ల‌నొప్పిగా మారింద‌నే చెప్ప‌వ‌చ్చు. అయితే ఆ త‌ల‌నొప్పి ఇప్పుడ‌ప్పుడే వ‌దిలేలా లేదు. ఎందుకంటే జియో మ‌రో సంవ‌త్స‌రం పాటు ఏదో ఒక ఆఫ‌ర్‌ను వినియోగ‌దారుల‌కు అందించే యోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలిసింది.

ప‌లు ప్ర‌ముఖ మీడియా సంస్థ‌ల క‌థ‌నం ప్ర‌కారం… జియో తాను అందిస్తున్న ఉచిత డేటా ఆఫ‌ర్ల‌ను మ‌రో సంవ‌త్స‌ర నుంచి 18 నెల‌ల వ‌ర‌కు పొడిగించే అవ‌కాశం ఉంద‌ట‌. అంతేకాదు, ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ఓ కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చేందుకు జియో స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు స‌మాచారం అందింది. ఆ ప్లాన్ ప్ర‌కారం కేవ‌లం రూ.100 రీచార్జ్ చేయించుకుంటే చాలు ఎంతైనా డేటా, వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్‌లు వాడుకునే వీలుంటుంద‌ట‌. అవును, మీరు వింటున్న‌ది క‌రెక్టే. ఇదే ప్లాన్‌ను జియో తీసుకువస్తుంద‌ట‌.

ఇలా గ‌న‌క ఒక‌వేళ జ‌రిగితే అప్పుడు జియో దెబ్బ‌కు ఇత‌ర టెలికాం సంస్థ‌ల‌న్నీ కుదేల‌వ‌డం ఖాయం. ఇప్ప‌టికే భారీ న‌ష్టాల‌ను చ‌విచూస్తున్న ఆ సంస్థ‌లు జియో ఆఫ‌ర్లతో మ‌రింత దిగి రాక త‌ప్ప‌దు. ఆ క్ర‌మంలో వినియోగ‌దారుల‌కు మ‌రింత ల‌బ్ది చేకూరుతుంద‌ని మార్కెట్ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఒక వేళ జియో నిజంగానే పైన చెప్పిన విధంగా ఆఫ‌ర్ల‌ను తీసుకురావాలే గానీ, ఇక అప్పుడది మ‌న దేశంలో పెద్ద విప్ల‌వ‌మే అవుతుంది. అయితే ఇప్పుడు మ‌న‌కు అందుతున్న స‌మాచారం అంతా కేవ‌లం ఊహాగానాలు మాత్ర‌మే. మ‌రి దీన్ని జియో నిజం చేస్తుందో లేదో వేచి చూడాలి..!

Share.

Comments are closed.