జ‌న‌సేన నేత‌లంతా మాజీలే!

0

జ‌న‌సేన నేత‌లంతా మాజీలే!

janasena cader is ex prajarajyam cader?

janasena cader is ex prajarajyam cader?

ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స్థాపించ‌నున్న జ‌న‌సేన పార్టీలో కీల‌కంగా ప‌నిచేయ‌నున్న వారంతా మాజీలే. మాజీలే అంటే కొంప‌దీసి మాజీ న‌క్స‌లైట్లు అనుకునేరు. గ‌తంలో ప్ర‌జారాజ్యంలో ప‌నిచేసిన‌వారు. 2019 నాటికి జ‌న‌సేన పార్టీని కార్య‌రంగంలోకి దింపేలా ప‌వ‌న్ పార్టీ నిర్మాణంలో ఒక్కో అడుగు వేస్తున్నారు. ప్ర‌జారాజ్యం పార్టీ స్థాపించిన‌ప్పుడు ఎదురైన ఇబ్బందులు, జెండా పీకేసే ప‌రిస్తితులు మ‌ళ్లీ త‌లెత్త‌కుండా వాటిని అధిగ‌మించ‌డానికి జ‌న‌సేనాని క‌ష్ట‌ప‌డుతున్నాడ‌ట‌. కాక‌పోతే జ‌న‌సేన పార్టీలో ప్ర‌జారాజ్యంలో ప‌నిచేసిన సేన ఉన్న‌ద‌ని కామెంట్స్ జోరుగా వినిపిస్తున్నాయి. పూర్తిస్థాయిలో పార్టీ ప‌ద‌వులు అప్ప‌జెప్ప‌క‌పోయినా.. ఉన్న కొద్ది ప‌ద‌వుల్లో మాత్రం పార్టీలో క్రియాశీల‌కంగా పనిచేసేవారు ప్ర‌జారాజ్యంలో గ‌తంలో చేసిన‌వారే.

 

చిరంజీవితో స‌న్నిహితంగా ఉండే జ‌ర్న‌లిస్టు హ‌రిప్ర‌సాద్ జ‌న‌సేన‌పార్టీ మీడియా విభాగాన్ని చూసుకుంటున్నారు. ప్ర‌జారాజ్యం స‌మ‌యంలో ప‌వ‌న్‌తో స‌న్నిహితంగా మెలిగిన శేఖ‌ర్ గౌడ్ జ‌న‌సేన తెలంగాణ వ్య‌వ‌హారాలు చూసుకుంటున్నారు. ఉద్దేశ్య‌పూర్వ‌కంగానో, మామూలుగానో తెలియ‌దు కానీ.. ప్ర‌స్తుతం జ‌న‌సేన‌లో కీల‌కంగా ఉన్న‌వారంతా గ‌తంలో ప్ర‌జారాజ్యంలో ప‌నిచేసినవారే!

Share.

Comments are closed.