లీకైన ‘జై లవకుశ’ స్టోరీలైన్…సూపర్ ట్విస్ట్

0

 

స్టార్ హీరోల సినిమాలు సెట్స్ మీదకి వెళ్ళడమే ఆలస్యం.. బోలెడన్ని విషయాలు కుప్పలుతెప్పలుగా లీకవుతూ వస్తుంటాయి. ఈ ట్రెండ్ మొదలయ్యి చాలాకాలమే అయ్యిందిలెండి. ఫస్ట్‌లుక్ కూడా రిలీజ్ అయి వుండదు.. అప్పుడే స్టోరీలు బయటపడిపోతాయి. తాజాగా ‘జై లవ కుశ’ కూడా ఆ లీకేజ్ బారిన పడింది. తొలుత తారక్ ఇందులో మూడు పాత్రలు పోషిస్తున్నాడనే టాప్ సీక్రెట్ రివీల్ అవ్వగా.. ఇప్పుడు ఏకంగా కథనే లీకైపోయింది. ప్రస్తుతం అది సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. పదండి.. ఆ స్టోరీలైన్ ఎలాగుందో మనమూ ఓ లుక్కేద్దాం…

 

‘జై’ ఓ భయంకరమైన విలన్‌. డబ్బులు సంపాదించడం కోసం ఎంత నీచమైన పనులు చేయడానికైనా వెనుకాడడు. ‘లవకుమార్’.. ఇతడు ఓ బ్యాంక్‌లో మేనేజర్‌గా పనిచేస్తుంటాడు. ఇతను చాలా సిన్సియర్. ‘కుశ’.. ఇతను ఓ ఆర్టిస్ట్. సినిమాల్లో గొప్ప నటుడిగా రాణించాలనే ఆశయంతో.. అవకాశాల కోసం ప్రయత్నిస్తుంటాడు. కట్ చేస్తే.. లవకుమార్ పనిచేస్తున్న బ్యాంక్ ఓరోజు దోపిడీకి గురవుతుంది. అదెలా జరిగిందోనని ఇన్వెస్టిగేషన్ చేయగా.. లవకుమార్ చేసినట్లు సిసిటివి కెమెరాల్లో రికార్డ్ అవుతుంది. దాంతో పోలీసులు అతడ్ని వెంటనే అదుపులోకి తీసుకుంటారు. మరోవైపు.. కుశ కూడా చాలా ఇబ్బందుల్లో ఇరుక్కుంటాడు. దాంతో ఖాకీలు అతనివెంట కూడా పడతారు. కానీ.. అతడు మాత్రం వారికి దొరక్కుండా తలదాచుకుంటాడు. అసలు తామిద్దరం సడెన్‌గా ఇలా ఇబ్బందుల్లో పడ్డామేంటని అనుకుంటుండగా.. ఇదంతా ‘జై’ ఒక్కడే వెనకుండి వ్యవహారం నడిపించాడని షాకింగ్ సీక్రెట్ రివీల్ అవుతుంది.

 

ఆ ఇద్దరినీ ఇరకాటంలో పడేసి.. ‘జై’ సొమ్ము చేసుకుంటాడు. ఆ ఇద్దరి రోల్స్‌ని ఇతడే పోసిస్తూ.. ఆడియెన్స్‌కి తన నటవిశ్వరూపం చూపిస్తాడు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ మొత్తం వ్యవహారాన్ని జై నడిపించినట్లు చివరిదాకా రివీల్ అవ్వదట. ఇదే ఈ చిత్రంలో అతిపెద్ద ప్లస్ పాయింట్ అని అంటున్నారు. ఇంతేకాదు.. ఇంకో దిమ్మతిరిగే షాకింగ్ సీక్రెట్ కూడా వుందని తెలిసింది. ‘జై’తో పాటు ఇంకో విలన్ కూడా వుంటాడని, అతని చంపిన తర్వాత సినిమా శుభంకార్డ్ పడుతుందని టాక్ వినిపిస్తోంది. మరి.. ఈ స్టోరీ నిజమా! కాదా తెలియాలంటే, రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

Share.

Comments are closed.