ఒక ఇంటివాడైన జబర్దస్త్ కమెడియన్ చమ్మక్ చంద్ర

0

jabardasth comedian chammak chandra new houseఎక్కడ ఉండాల్సిన వాడు ఎక్కడికో ఎదిగిపోయాడు.. ఇలా అనూహ్యంగా పైకొచ్చిన వారి గురించి చెబుతుంటే వింటుంటాం. ఇదిగ్గో సరిగ్గా ఇలా చెప్పుకోవాల్సిన అందరినీ ఓ వేదిక మీద చూస్తే.. అసలు ఓ వేదికే వారికి జీవితాన్నిస్తే అదే జబర్దస్త్.. అవకాశాల కోసం అందరినీ ఎదిరించి హైదరాబాద్ మహానగర్ చేరుకున్నవారే వారంతా. అన్నం నీళ్లు లేక రోజుల తరబడి ఫిల్మ్ నగర్ లో ఆశగా తిరిగిన వారే.. కాని ఇప్పుడు తమ జీవితంలో తామే ఊహించలేనంతగా ఎదిగిపోయారు.. అందుకే జబర్దస్త్ కమెడియన్స్ అంతా ఓ కుటుంబంలా ఉంటారు.

కమెడియన్‌గా ఎన్నో సినిమాలు చేసినప్పటికీ పెద్దగా పేరు సంపాదించుకోలేకపోయాడు చంద్ర. అయినా జబర్దస్త్ కామెడీ పరంగా చంద్ర సూపర్ సక్సెస్ అనే చెప్పుకోవాలి. గురువారం ప్రసారమయ్యే జబర్దస్త్ లో రైజింగ్ స్టార్ హైపర్ ఆది అయితే శుక్రవారం వచ్చే ఎక్స్ ట్రా జబర్దస్త్ సూపర్ స్టార్ చమ్మక్ చంద్ర. చంద్ర ఫ్యామిలీ స్కిట్లకు మిలియన్ వ్యూస్ గ్యారెంటీ. అందుకే అతగాడి రెమ్యునరేషన్ మిగిలిన వారికంటే కాస్త ఎక్కువగానే ఇస్తున్నారట.

ఒకవైపు ఆడవాళ్ళను తక్కువ చేస్తూనే, మరో పక్క వాళ్ళ విలువ ఏంటో చెబుతూ అందరి అభిమానాన్ని పొందుతున్నాడు .జబర్దస్త్ షో తో మంచి పాపులారిటి సంబంధించిన వాళ్ళలో ఒకడు చమ్మక్ చంద్ర. ఫ్యామిలి స్కిట్ తో కడుపుబ్బా నవ్వించే చంద్ర అంటే అందరు ఇష్ట పడతారు. ఆడవాళ్ళు, భార్యలపై వేసే జోకులతో చంద్రకు మంచి నేమ్.. ఫేమ్ వచ్చింది. అయితే జబర్దస్త్ ఆర్టిస్టులు అందరూ..

ఒక్కొక్కరుగా సొంతింటి కల నెరవేర్చుకుంటున్నారు. సుధీర్, శ్రీను తదితరులు ఇటీవల సొంతింట్లోకి అడుగుపెట్టారు. ఇప్పుడు చమ్మక్ చంద్ర వంతు. తాజాగా చంద్ర నూతన గృహ ప్రవేశం చేశాడు. ఈ కార్యక్రమం అంతా సింపుల్‌గా జరిగిపోయినట్టుంది. పెద్దగా ఆర్భాటంగానీ, సెలబ్రిటీల సందడీ, హడావిడీ లేకుండా సింపుల్‌గా గృహప్రవేశం చేసాడు చంద్ర. ఈ విషయం కూడా రచ్చరవి పెట్టిన ఫేస్బుక్ పోస్ట్ తోనే అందరికీ తెలిసింది. ఒక్క రచ్చ రవి మాత్రం కార్యక్రమానికి హాజరైనట్టు తెలుస్తోంది. చంద్రకు జబర్దస్త్‌లో రవి మంచి హ్యాండ్. ఎందుకంటే..

వీరిద్దరు కలిసి చేసిన స్కిట్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. దీంతో వీరిద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఏర్పడింది. దీంతోనే రచ్చ రవిని ఒక్కడినే తన గృహ ప్రవేశానికి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఆనందమానందమాయనే చంద్ర గృహ ప్రవేశం అంటూ రవి ఓ ఫోటోను షేర్ చేశాడు. “ఆనందమానందమాయనే మా చంద్రన్న ఒక ఇంటి వాడు ఆయనే…” అంటూ రవి ఇంట్రో పెట్టి చంద్ర గృహ ప్రవేశం సందర్భంగా దిగిన ఫోటోకు టాగ్ చేశారు. ఇక అక్కడ కామెంట్ల రూపంలో చంద్రకి అభినందనలు తెలుపుతున్నారు చంద్ర ఫ్యాన్స్, శ్రేయోభిలాషులు.

Share.

Comments are closed.