శశికళ ఇళ్లు, ఆఫీసులు సోదాలు .. రూ.1430 కోట్ల అక్రమాస్తు

0

చెన్నై: ఇప్పటికే అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఏఐఏడీఎంకే నేత శశికళ మరిన్ని చిక్కుల్లో పడింది. గత వారం రోజులుగా ఆమెతోపాటు బంధువుల ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో సుమారు రూ.1430 కోట్ల అక్రమాస్తులను అధికారులు గుర్తించారు. ఈ విషయమై త్వరలోనే జైల్లో ఉన్న శశికళను ఐటీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది.

it raids on sasikala properties

శశికళ, ఆమె మేనల్లుడు దినకరన్‌తోపాటు బంధువుల ఇళ్లు, ఆఫీసులు కలిపి మొత్తం 187 ప్రదేశాల్లో ఈ సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో రూ.7 కోట్ల నగదు, రూ.5 కోట్ల విలువైన నగలు, రూ.12 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఓ అధికారి వెల్లడించారు.

15 బ్యాంకు లాకర్లు, డైమండ్ నగలను సీజ్ చేశారు. మొత్తం అక్రమాస్తుల విలువ రూ.1430 కోట్ల వరకు ఉంటుందని ప్రాథమిక విచారణలో తేలిందని ఆ అధికారి చెప్పారు. ఇక షెల్ కంపెనీలది వేరే సంగతని ఆయన అన్నారు.

Share.

Comments are closed.