త్వ‌ర‌లో జీమెయిల్ ద్వారా కూడా డబ్బు పంపుకోవచ్చు..!

0

ఐఎంపీఎస్, యూపీఐ, నెఫ్ట్, ఆర్‌టీజీఎస్, ఆధార్ పే వంటి రక రకాల మార్గాల్లో ప్రస్తుతం వినియోగదారులు డబ్బులు పంపుకుంటున్నారు, తీసుకుంటున్నారు. అయితే ఇకపై మరో కొత్త మనీ ట్రాన్స్‌ఫర్ విధానం అందుబాటులోకి రానుంది. అయితే అది ప్రభుత్వం, బ్యాంకులు ప్రవేశపెడుతున్న మనీ ట్రాన్స్‌ఫర్ విధానం కాదు. సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ ప్రవేశపెడుతున్న ఓ సరికొత్త మనీ ట్రాన్స్‌ఫర్ పద్ధతి అది. యూజర్లు కేవలం ఓ జీమెయిల్ ఐడీ కలిగి ఉంటే చాలు, దాని ద్వారా డబ్బులు పంపేందుకు, తీసుకునేందుకు వీలు కలుగుతుంది.

gmail-will-let-you-send-and-receive-money-with-its-android-app

gmail-will-let-you-send-and-receive-money-with-its-android-app

జీమెయిల్ యాప్‌ను ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై వాడుతున్న యూజర్లు ఇకపై నేరుగా ఈ-మెయిల్స్ పంపడం ద్వారానే డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు, తీసుకోవచ్చు. అందుకు గాను ఓ కొత్త ట్రాన్స్‌ఫర్ పద్ధతిని గూగుల్ ప్రవేశపెట్టింది. ఈ విధానం ప్రస్తుతం యూఎస్‌ఏలోని జీమెయిల్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా జీమెయిల్‌ను వాడుతున్న యూజర్లకు అందుబాటులోకి రానుంది. దీని వల్ల యూజర్లు అవతలి వ్యక్తి మెయిల్ ఐడీ, ఎంత డబ్బు పంపుతున్నారో ఆ మొత్తాన్ని మెయిల్‌లో ఇచ్చే ప్రత్యేక ఆప్షన్‌లో ఎంటర్ చేస్తే చాలు. దీంతో అవతలి వ్యక్తులకు క్షణాల్లోనే మెయిల్ ద్వారా డబ్బు అందుతుంది. దాన్ని వారు బ్యాంకుకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అందుకు గాను ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన పనిలేదు.

Share.

Comments are closed.