అల్లం పొట్టును వాడుతున్నారా..? అయితే జాగ్ర‌త్త‌..!

0

ginger-peel-2అల్లంను మ‌నం ఎక్కువ‌గా వంటల్లో ఉపయోగిస్తుంటాం. దీని వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అల్లం వ‌ల్ల మ‌న శ‌రీర జీర్ణ‌వ్య‌వ‌స్థ చ‌క్క‌బ‌డుతుంది. గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మస్య‌లు పోతాయి. మాన‌సిక ఒత్తిడిని త‌గ్గించే గుణం అల్లంలో ఉంది. దీని వ‌ల్ల బ‌రువు కూడా త‌గ్గుతారు. జ్ఞాప‌క శ‌క్తి పెరుగుతుంది. ఇవే కాకుండా ఇంకా ఎన్నో ఇత‌ర లాభాలు కూడా అల్లం వ‌ల్ల మ‌నకు క‌లుగుతాయి. అయితే అల్లం మ‌న‌కు ఎంత ప్ర‌యోజ‌న‌క‌ర‌మో, దాని పొట్టు మాత్రం అంతే ప్ర‌మాద‌క‌ర‌మ‌ట‌. ఇది చెబుతోంది మేం కాదు, అల్లం పొట్టుపై ప‌రిశోధ‌న‌లు చేసిన ప‌లువురు సైంటిస్టులు చెబుతున్న మాట‌లు ఇవి..!

ginger-peel-1 ginger-in-tea

అల్లం పొట్టులో విష ప‌దార్థాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ట‌. ఇవి మ‌న శ‌రీరానికి హాని క‌ల‌గ‌జేస్తాయ‌ట‌. చాలా మంది అల్లంను పొట్టుతోపాటు వాడుతుంటారు. ప్ర‌ధానంగా టీ పెట్టే వారు అల్లంను అలాగే పొట్టుతో వేసి టీ పెడ‌తారు. దాంతో ఆ టీని చాలా మంది తాగుతారు. అలా తాగ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలోకి అల్లం పొట్టులో ఉండే విష ప‌దార్థాలు వెళ్తాయ‌ట‌. క‌నుక అల్లం పొట్టును వాడ‌కుండా ఉండ‌డ‌మే బెట‌ర‌ని స‌ద‌రు సైంటిస్టులు చెబుతున్నారు.

Share.

Comments are closed.