ప‌సుపు రంగులో ఉన్న దంతాల‌ను తెల్ల‌గా మార్చే ట్రిక్స్ ఇవిగో..!

0
follow these tips to whiten your yellow teeth

follow these tips to whiten your yellow teeth

మీ దంతాలు ప‌సుపు ప‌చ్చ‌గా ఉన్నాయా..? ఎన్ని టూత్ పేస్టులు, పౌడ‌ర్లు వాడినా, బ్ర‌ష్‌లు మార్చినా ఫ‌లితం ఉండ‌డం లేదా..? న‌లుగురిలో నోరు తెరిచి న‌వ్వాల‌న్నా, మాట్లాడాల‌న్నా ఇబ్బందిగా ఉందా..? అయితే ఈ టిప్స్ మీ కోస‌మే. వీటిని పాటిస్తే మీ దంతాలు తెల్ల‌గా మెరుస్తాయి. త‌ర‌చూ ఇలా చేస్తుంటే దంతాలు ప‌సుపు రంగులోకి మార‌వు స‌రి క‌దా, ఇంకా అవి మిల మిల మెరుస్తూనే ఉంటాయి. ఈ క్రమంలో ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. యాపిల్ పండ్ల‌ను దంతాలతో బాగా న‌మిలి తింటుంటే ప‌సుపు రంగులో ఉన్న దంతాలు తెల్ల‌గా మారుతాయి.2. కీర‌దోస కాయ‌ల‌ను దంతాల‌తో కొరికి తింటుంటే దంతాల‌పై ఏర్ప‌డే ప‌సుపు రంగు పోతుంది. దీంతో దంతాలు తెల్ల‌గా మెరుస్తాయి.3. నిమ్మ‌జాతికి చెందిన పండ్ల‌ను తింటుంటే దంతాలు తెల్ల‌గా మారుతాయి. వాటిపై ఉండే ప‌సుపుద‌నం పోతుంది. ఒక టీస్పూన్ నిమ్మ‌రసాన్ని 200 ఎంఎల్ నీటిలో క‌లిపి దాంతో నోటిని బాగా పుక్కిలించాలి. దంతాల‌కు ఆ నీరు త‌గిలేలా చూడాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ప‌సుపు రంగులో ఉన్న దంతాలు తెల్ల‌గా మారుతాయి.4. నిత్యం బ్ర‌ష్ చేసిన వెంట‌నే కొద్దిగా ఉప్పును నీటిలో క‌లిపి ఆ నీటితో దంతాల‌కు త‌గిలేలా నోటిలో పుక్కిలించాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా ప‌సుపు దంతాలు రంగు మారుతాయి.

5. కొద్దిగా బొగ్గు తీసుకుని అందులో కొంత ఉప్పు క‌లిపి బాగా దంచాలి. ఈ మిశ్ర‌మాన్ని బ్ర‌ష్‌తో దంతాల‌పై రుద్దుకోవాలి. అనంత‌రం క‌డిగేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల తొంద‌ర‌లోనే దంతాలు తెల్ల‌గా మారుతాయి.

6. వేప ఆకును దంతాల‌కు త‌గిలేలా బాగా న‌మిలి ఊసేయాలి. అనంత‌రం వేపు పుల్ల‌తో దంతాలు తోముకోవాలి. ఇలా చేస్తే ప‌సుపు రంగు దంతాలు తెల్ల‌గా మారుతాయి.

7. బాగా పండిన అర‌టి పండు తొక్క లోప‌లి భాగంతో దంతాల‌ను తోమాలి. ఇలా త‌ర‌చూ చేస్తూ ఉంటే దంతాలు ప‌సుపు రంగు నుంచి తెలుపు రంగుకు మారి మిల మిల మెరుస్తాయి.

8. ప‌చ్చి క్యారెట్‌ను త‌ర‌చూ తింటుంటే దంతాలు తెల్ల‌గా మారుతాయి.

9. దాల్చిన చెక్క‌లో కొద్దిగా ఉప్పు క‌లిపి పౌడ‌ర్‌లా చేసుకోవాలి. దాంతో ప‌ళ్లు తోముకోవాలి. ఇలా చేస్తే దంతాల‌కు ప‌ట్టిన ప‌సుపు రంగు పోతుంది.

Share.

Comments are closed.