రోజూ పెరుగు ఎందుకు తినాలో తెలుసా?!

0

Do You Know Why We Should Eat Curd Every Day

మంచి పెరుగు ఇప్పుడు దొరకడం కూడా కష్టమైపోయింది కాని, మన పెద్దవారిని అడిగితే చెబుతారు.. అసలు పెరుగు లేకుండా వారికి పూట కూడా గడిచేది కాదని.. తాము పెరుగు వేసుకోకుండా భోజనం ముగించేవారం కాదని. మరి ఇప్పుడో? వారంలో ఎన్నిరోజులు పెరుగు తింటున్నాం? అందులో నాణ్యత ఎంత? అనేది తరచి చూసుకోవాల్సి వస్తోంది.

అసలు పెరుగుతో భోజనాన్ని ముగించడం తెలుగు ఇళ్ళలో వందల సంవత్సరాలుగా ఉన్న ఆచారం లాంటిది. అలాంటి మాటలు ఈ కాలం వారికి నచ్చకపోవచ్చు కాని, పెరుగు వల్ల ఆరోగ్యానికి ఎన్నని ఉపయోగాలు ఉన్నాయో, రోజు పెరుగు ఎందుకు తీసుకోవాలో చెప్పి చూడండి. ఇకనుంచయినా పెరుగు తినడం అలవాటు చేసుకుంటారు.. ఇంతకూ పెరుగు ఎందుకు తినాలంటే..

రోజూ పెరుగు ఎందుకు తినాలంటే..

  • పెరుగులో కాల్షియం, విటమిన్ డి ప్రోటీన్, పాజిటివ్ బ్యాక్టీరియా ఉంటాయి.
  •  బిర్యాని సెంటర్స్ లో పెరుగు ఎందుకు ఇస్తారో తెలుసా ? స్పైసీ ఫుడ్ వలన ఒంట్లో జెనరేట్ అయ్యే హీట్ ని పెరుగు న్యూట్రలైజ్ చేస్తుంది. పెప్టిక్ అల్సర్స్ ని ట్రీట్ చేయడానికి ఉపయోగపడుతుంది.
  •  పెరుగు లో గట్ బ్యాక్టీరియా ఉండటం వల్ల ఇది క్రీములతో బాగా పోరాడుతుంది. రోగనిరోధకశక్తి పెంచటంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ తో ఇబ్బందిపడే మహిళలకు ఇది ఏంతో ఉపయోగం. యోనిపై ఇన్ఫెక్షన్స్ దాడి చేయకుండా అడ్డుకోవాలంటే పెరుగుని డైట్ లో చేర్చుకోవాలి..
  •  కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల పెరుగు ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతుంది. రెగ్యులర్ గా పెరుగు తినేవారికి కీళ్ళనొప్పులు రావడం, దంతాలలో నొప్పులు రావడం తక్కువ అవుతాయని బోన్స్ స్పెషలిస్టులు చెబుతున్నారు
  •  కొలెస్టరాల్ లెవెల్స్ తగ్గించటానికి, బ్లడ్ ప్రెషర్ లెవల్స్ తగ్గించడానికి పెరుగు చేసే సహాయం అంతా ఇంతా కాదు. రోజు పెరుగుతో తినాలె కాని, మీ గుండె చాలా బలంగా ఉంటుంది.
  •  విటమిన్ ఈ, జింక్, ఫాస్ఫరస్ ఉండటం వల్ల ఇది చర్మ ఆరోగ్యానికి కూడా పనికివస్తుంది. అలాగే స్ట్రెస్ తో బాధపడేవారు పెరుగు ఇన్టేక్ ని పెంచితే అంచి ఫలితాలు ఉంటాయి.

Share.

Comments are closed.