ఆర్‌బీఐ గ‌వ‌ర్న‌ర్ ఉర్జిత్ ప‌టేల్ జీతం ఎంతో తెలుసా..?

0
do you know the salary of RBI Governor Urjit Patel

do you know the salary of RBI Governor Urjit Patel

ఉర్జిత్ పటేల్‌… ఈ పేరు గురించి ఎవ‌రికీ ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. నోట్ల ర‌ద్దు మొద‌లుకొని ఇటీవ‌లి వ‌ర‌కు మ‌న దేశంలో జ‌రిగిన ఆర్థిక‌ప‌ర‌మైన ప‌రిణామాల‌న్నింటిలోనూ ఈయ‌న పేరు ప్ర‌ముఖంగా వినబ‌డుతోంది. గ‌తంలో ఏ ఆర్‌బీఐ గ‌వ‌ర్న‌ర్‌కూ రానంత పేరు ఈయ‌న‌కు వ‌చ్చిందంటే అతిశ‌యోక్తి కాదు. ఇంత‌కీ అసలు విష‌యం ఏమిటంటే… ఆర్‌బీఐ గ‌వ‌ర్న‌ర్ జీతం గురించే. ఆ పోస్టుకు ఎంత జీతం ల‌భిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇప్ప‌టి వ‌రకు ఆర్‌బీఐ గ‌వ‌ర్న‌ర్ వేత‌నం నెల‌కు రూ.90వేలు ఉండ‌గా ఇప్పుడ‌ది ఏకంగా 100 శాతం పెరిగింది. దీంతో ఇప్ప‌టి ఆర్‌బీఐ గ‌వ‌ర్న‌ర్ ఉర్జిత్ ప‌టేల్ ఏకంగా రూ.2.50 ల‌క్ష‌ల వేత‌నాన్ని అందుకోనున్నారు. అదేవిధంగా డిప్యూటీ గ‌వ‌ర్న‌ర్‌లు రూ.2.25 ల‌క్ష‌ల జీతాన్ని అందుకుంటారు.

ఈ పెంపు గ‌డిచిన ఏడాది నుంచే వ‌ర్తిస్తుంద‌ట‌. దీంతో గ‌తంలో అందుకున్న జీతం కాకుండా మిగిలిన మొత్తాన్ని ఉర్జిత్ అందుకోనున్నారు. ఏది ఏమైనా… ఆర్‌బీఐ నియంత్రిస్తున్న ప‌లు బ్యాంకుల‌కు చెందిన అధికారులతో పోలిస్తే ఉర్జిత్ కు వ‌స్తుంది త‌క్కువే. అయినా ఆ పోస్టుకు ఎంత‌టి విలువ ఉంటుందో తెలుసు క‌దా..! ఇక జీతం త‌క్కువ వ‌స్తే ఏమీ కాదులే..!

Share.

Comments are closed.