త్వ‌ర‌లో కేంద్ర ప్ర‌భుత్వం ఆవుల‌కు ఆధార్ కార్డులు ఇస్తుంద‌ట తెలుసా..?

0

గోవు చుట్టూ రాజకీయం తిరుగుతున్నది. గో రక్షణ పేరుతో హింస చెలరేగుతున్నది. ఈ క్రమంలో గోవులకూ ఆధార్‌ సంఖ్యను కేటాయించాలని కేంద్రం నిర్ణ యించింది. దేశవ్యాప్తంగా ఎన్ని గోవులున్నాయి.వాటి ఆరోగ్య పరిస్థితి సహా అవి ఎక్కడికి తరలిపోతున్నాయి అనే వివరాలు పసిగట్టేందుకు కేంద్రం కొత్త పథకానికి రూప కల్పన చేస్తున్నది. పౌరులకు ఇచ్చిన తరహాలో గోవులకూ ఆధార్‌ తరహాలో గుర్తింపు కార్డు ఇవ్వాలని కేంద్రం కస రత్తు చేస్తున్నది. ఈ మేరకు విశిష్ట గుర్తింపు సంఖ్య (యూ ఐడీ)కు సంబంధించిన నివేదికను ప్రభుత్వం సుప్రీం కోర్టుకు సమర్పించింది.

ఈ నేవిదిక ప్రకారం గోవులకు ఆధార్‌ సంఖ్యను ఇవ్వడంతో పాటు లేగదూడల సంరక్షణకూ ప్రత్యేక చర్యలు చేపట్టనున్నది. ఇండో-బంగ్లా సరిహద్దుల గుండా పశువుల అక్రమ రవాణాకు చెక్‌ పెట్టేందుకు తీసుకునే చర్యలనూ ఈ నివేదికలో ప్రభుత్వం పొందు పరిచింది. హోంమంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సూచనలకు అనుగుణంగా నివేదికను రూపొం దించారు. ఆవుల స్మగ్లింగ్‌ను అడ్డుకునేందుకు ప్రతి జిల్లాలో 500 జీవాలకు సరిపడే స్దలంతో షెల్టర్‌ హోమ్‌లను నివేదికలో ప్రతిపాదించారు. గోవుల‌ యజమానులు, రైతుల అభ్యున్నతికీ నివేదికలో పలు ప్రతిపాదనలున్నాయి.

గుర్తింపు నంబర్‌ ద్వారా గోవులకు సరైన సమయంలో టీకాలు ఇవ్వడం, వాటి సంరక్షణను పర్యవేక్షించడం సులువవుతుందని సర్కార్‌ భావిస్తోంది.యూఐడీ గుర్తింపునకు కేంద్రం రూ.148 కోట్లు ఖర్చు చేయనుంది. 2017 సంవత్సరాంతానికి గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్రం రాష్ట్రాలను కోరుతోంది.

Share.

Comments are closed.