రిల‌య‌న్స్ జియో ప్ర‌క‌టించిన మ‌రో కొత్త ఆఫ‌ర్ వింటే షాక‌వుతారు..!

0

Reliance Jio Free Caller Tune Offerఉచిత 4జీ ఇంట‌ర్నెట్‌, వాయిస్ కాల్స్‌, ఎస్ఎంఎస్‌లు, యాప్ సేవ‌ల‌తో జియో వినియోగ‌దారుల‌ను ఎలా ఆక‌ట్టుకుందో తెలిసిందే. మొద‌ట రిలీజైన‌ప్పుడు వెల్‌క‌మ్ ఆఫ‌ర్‌, ఆ త‌రువాత హ్యాపీ న్యూ ఇయ‌ర్ ఆఫ‌ర్‌, ఇప్పుడు ప్రైమ్ మెంబ‌ర్ షిప్‌, స‌మ్మర్ స‌ర్‌ప్రైజ్ అంటూ జియో ఎప్ప‌టిక‌ప్పుడు త‌న వినియోగ‌దారుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టిస్తూనే ఉంది. అయితే ఇప్పుడు తాజాగా మ‌రో ఉచిత ఆఫ‌ర్‌ను త‌న వినియోగ‌దారులకు అందించ‌నుంది. అదే కాల‌ర్ ట్యూన్స్‌..!

అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. జియో యూజ‌ర్లు త‌మ ఫోన్ నంబ‌ర్ల‌కు గాను ఉచితంగా కాలర్ ట్యూన్స్ సెట్ చేసుకోవ‌చ్చు. ప్ర‌స్తుతం ఇత‌ర నెట్‌వ‌ర్క్‌లు అన్నీ నెల‌కు క‌నీసం రూ.30తోపాటు కొత్త‌గా ట్యూన్ సెట్ చేసుకుంటే రూ.15 వ‌ర‌కు చార్జిని వ‌సూలు చేస్తున్నాయి. అయితే జియోలో మాత్రం అలా కాదు. యూజ‌ర్లు ఎలాంటి చార్జిలు చెల్లించాల్సిన అవ‌స‌రం లేకుండానే ఫ్రీగా కాల‌ర్ ట్యాన్స్‌ను సెట్ చేసుకోవ‌చ్చు. అయితే అందుకు ఏం చేయాలంటే…

జియో యూజ‌ర్లు జియో మ్యూజిక్ యాప్ వేసుకుంటే అందులో కాల‌ర్ ట్యూన్ల‌ను ఎలా యాక్టివేట్ చేసుకోవాలో లింక్ ద‌ర్శ‌న‌మిస్తుంది. దాన్ని ఫాలో అయితే చాలు, వారు ఎంచ‌క్కా ఉచితంగా కాల‌ర్ ట్యూన్ల‌ను సెట్ చేసుకోవ‌చ్చు. ఇంకెందుకాల‌స్యం… వెంట‌నే అలా చేసేయండి మ‌రి..!

Share.

Comments are closed.