కరెంటు షాక్ కొట్టిన వారిని కాపాడాలంటే ఏం చేయాలో తెలుసా..? అస్సలూ చేయకూడనివి ఏంటో కూడా చూడండి..!

0

Do you know How To save a Person From electric shock

కరెంట్ షాక్ కొట్టిన వారిని వెంటనే ముట్టుకోకూడదు.ఎందుకంటే వారిలో కరెంట్ ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి వారిని పట్టుకున్నవారికి కూడా షాక్ కొట్టే అవకాశం ఉంటుంది. చాలా విద్యుత్ ప్రమాదాలు ఈ అవగాహన లేకపోవడం వలన జరుగుతుంటాయి.. షాక్ కొట్టిన వారు ఏదైనా స్విట్చ్ ను, కరెంట్ వైర్ ను ఇంకా పట్టుకుని షాక్ కు గురౌతుంటే.. వారిని ముందుగా ఆ కరెంట్ నుంచి వేరు చేయాల్సి ఉంటుంది. దానికోసం ఎండిపోయిన కర్రలను, గ్లాస్, రబ్బర్, ఆస్ బెస్టాస్ వంటి వస్తువులను ఉపయోగించి కరెంట్ నుంచి బాధితులను వేరు చెయ్యాలి.

-షాక్ కొట్టిన వారికి వవెంటనే నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాగించకూడదు.
-కరెంట్ షాక్ కొట్టడం వలన బాగా కాలిపోయి దెబ్బలు తగిలితే ఆ ప్రదేశాలను చల్లని నీటితో కడగాలి.
-కరెంట్ షాక్ కొట్టినవారు మూర్ఛపోతుంటే వెంటనే వారిపై వేడిగా ఉండే దుప్పటి లేదా కోట్ ని కప్పాలి. దీంతో వారి శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది.
-కరెంట్ షాక్ వలన సీరియస్ అయ్యే పరిస్థితి ఉంటే వారికి వెంటనే హాస్పటల్ కి తీసుకెళితే రక్షించుకునేందుకు అవకాశం ఉంటుంది.కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే అంబులెన్సు ను పిలవడమో… లేదంటే దగ్గర్లో ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్లడమో చేయాలి

– కరెంట్ షాక్ కొట్టిన సందర్భంలో బాధిత వ్యక్తులకు శ్వాస సరిగ్గా ఆడక ఇబ్బంది పడుతుంటారు.అలాంటప్పుడు కృత్రిమ శ్వాసను నోటితో అందిచాలి. లేదంటే గుండెపై రెండు చేతులతో ఒత్తుతూ CPR చెయ్యాలి. వెన్నుముక్క బాగా గాయాలైతే తల, మెడ భాగాలను కదపకుండా చూసుకోవాలి.దీంతో నష్టాన్ని కొద్దిగా తగ్గించవచ్చు.
-షాక్ కొట్టడం వల్ల గాయాలై రక్త స్రావం జరుగుతూ ఉంటే శుభ్రమైన గుడ్డతో గాయాలకు కట్టుకట్టాలి. దీంతో బ్లీడింగ్ ఆగుతుంది. ఈ విధంగా కరెంట్ షాక్ కు గురైన వారికి మన వంతు సహాయం చేసి వారిని మనం కాపాడుకోవచ్చు.

Share.

Comments are closed.