మహాభారతం ఆరంభంలో ఈ ప్రేమ కథ తెలుసా..?

0

Mahabharatha startedమ‌హాభారతం గురించి అంద‌రికీ తెలిసిందే. దాని గురించి తెలియ‌ని వారుండ‌రు అంటే అతిశ‌యోక్తి ఉండ‌దు. పాండ‌వులు, కౌర‌వులు జ‌న్మించ‌డం, వారి మ‌ధ్య వ‌చ్చే గొడ‌వ‌లు, యుద్ధాలు, పోరాటాలు, పాండ‌వుల రాజ‌సం… అన్నీ మ‌నం చ‌దివాం. అయితే మ‌హాభార‌తం ఆరంభానికి ముందు అసలు ఏం జ‌రిగిందో తెలుసా..? అస‌లు మ‌హాభార‌త క‌థ ఎప్ప‌టి నుంచి ఆరంభ‌మైందో తెలియాలంటే ఇది చ‌దవాల్సిందే. ఇంకెందుకాల‌స్యం… ఆ క‌థేంటో ఓ సారి చూడండి..!

పూర్వం స‌త్య‌వ‌తి అనే అంద‌మైన మ‌హిళ ఉండేది. ఆమె చాలా అంద‌గ‌త్తె. కానీ ఆమె శ‌రీరం నుంచి చేప‌ల వాస‌న వ‌స్తుంది. దీంతో ఆమెను పెళ్లి చేసుకునేందుకు ఎవ‌రూ ముందుకు రారు. ఆ కార‌ణం చేత తీవ్ర వేదన చెందిన సత్యవతి అడవుల వెంట తిరుగుతూ ఓ నాడు పరాశర మహర్షి ఆశ్రమానికి చేరుకుంది. పరాశర మహర్షి గొప్ప తపశ్శాలి. పురాణాల్లో మొదటిదైన విష్ణు పురాణాన్ని రాసింది కూడా ఈయనే. కఠోర తపస్సు ద్వారా ఎన్నో యోగ సిద్ధులను సాధించాడు. అయితే సత్యవతి ఆయన ఆశ్ర‌మం మీదుగా వెళ్తుండ‌డంతో ఆమె శరీరం నుంచి వెలువడే చేపల వాసనకు ఆ ముని తపస్సుకు భంగం వాటిల్లుతుంది. అయితే ఆమె అందాన్ని చూసి చలించిన పరాశర మహర్షి సత్యవతిని తన కోరిక తీర్చమంటాడు. అలాగే మన ఇద్దరి కలయిక వల్ల గొప్ప విద్వాంసుడు జన్మిస్తాడని అంటాడు. అయితే తన మూడు కోరికలు నేరవేర్చితేనే దీనికి ఒప్పకుంటానని సత్యవతి అంటుంది. అవేమిటంటే…

do you know how Mahabharatha started

1. మనం కలిసున్నప్పుడు పంచభూతాలు సైతం తిలకించరాదని కోరుకుంటుంది. దీనికి అంగీకరించిన పరాశర మహర్షి చుట్టూ ఒక కృత్రిమ గుడారాన్ని రూపొందిస్తాడు.

2. దీని వల్ల తన కన్యత్వం చెక్కుచెదరకుండా ఉండాలని సత్యవతి కోరింది. బిడ్డ పుట్టిన తర్వాత తన శక్తులతో కన్వత్వాన్ని తిరిగి ప్రసాదిస్తానని పరాశర మ‌హ‌ర్షి హామీ ఇస్తాడు.

3. తన శరీరం వెదజల్లే చేపల వాసన నుంచి విముక్తి కలిగించాలని కోరుకుంది. దీనిని నుంచి విముక్తి కలిగించడమే కాదు తొమ్మిది మైళ్ల దూరం వరకు వెదజల్లే సువాసనను శరీరానికి కలిగిస్తానని ప్రమాణం చేస్తాడు.

అలా స‌త్య‌వ‌తి పెట్టిన షరతులకు మ‌హ‌ర్షి అంగీక‌రిస్తాడు. దీంతో పరాశర మహర్షి కోరికను స‌త్య‌వ‌తి తీరుస్తుంది. అలా ఆ ఇద్దరి కలయిక వల్ల జన్మించివాడే వేద వ్యాసుడు. ఆయ‌నే మ‌హాభారం రాశాడు. ఈ క్రమంలోనే స‌త్య‌వ‌తి కోరినట్లుగానే తిరిగి ఆమెకు కన్యత్వాన్ని ప్ర‌సాదిస్తాడు ప‌రాశ‌రుడు. అప్పటి నుంచే సత్యవతిని మత్స్యగంధ పేరుతో పిలుస్తున్నారు. అయితే ఒక రోజు శంతనుడు గంగా తీరం వెంబడి నడుస్తున్న సమయంలో అద్భుతమైన సువాసన రావడంతో వెదుక్కొంటూ వెళ్లిన అతనికి సత్యవతి ఎదురవుతుంది. ఆమె అందానికి మంత్రముగ్దుడైన శంతనుడు అక్కడే ఆమెను గాంధర్వ వివాహం చేసుకుంటాడు. దీంతో అక్క‌డి నుంచి మ‌హాభార‌తం ప్రారంభ‌మ‌వుతుంది.

Share.

Comments are closed.