ఏ నొప్పులు ఉంటే ఎలా పడుకోకూడదో మీకు తెలుసా..!!

0

Do you have any pain, try these sleep positions,sleeping positions for different types of pains

మనం నిద్రపోయే భంగిమ మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. కొన్ని రకాల నిద్రపోయే పొజిషన్లు.. అనారోగ్యానికి దారితీస్తాయి. కొన్ని రకాల వ్యాధుల రిస్క్ ని కొన్ని స్లీపింగ్ పొజిషన్స్ పెంచితే మరికొన్ని తగ్గిస్తాయి. మరి మీరు నిద్రపోయే భంగిమ మీ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..

బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్లు ఇలా పడుకోకూడదు..

బోర్లా పడుకొనే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఈ పొజిషన్ జీర్ణక్రియను స్పీడ్ చేస్తుంది. ఇంతవరకు మంచిదే అయినా ఎటువంటి సపోర్ట్ లేని పొజిషన్ కావడంచేత బ్యాక్ పెయిన్ వచ్చే ప్రమాదం ఉంది. గురకపెట్టి అలవాటుండి, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ వంటివి లేకుంటే పొట్టపై (బోర్లా) పడుకోవచ్చు. కానీ పలుచటి దిండు ఉపయోగిస్తే మంచిది.

ఎడమవైపు మంచిది..

ఆహారం జీర్ణమై.. వ్యర్థాన్ని బయటకు తీసుకొచ్చే శోషరస గ్రంథులు, జీర్ణాశయం, మూత్రాశయం, క్లోమంపై ఎలాంటి ఒత్తిడి పడకుండా ఉండేందుకు ఎడమవైపు తిరిగే పడుకోవాలి. గర్భిణీ స్త్రీలు పడుకునే విషయంలో తీసుకునే జాగ్రత్తలను ప్రసవ విధానం ఆధారపడి ఉంటుంది. ఎడమవైపునకు పడుకుంటే బిడ్డకి, తల్లికి మధ్య రక్త ప్రసరణ చక్కగా ఉంటుంది.

చర్మ సమస్యలు ఉన్న వాళ్లు ఇలా వద్దు.. కానీ బ్యాక్ పెయిన్ తగ్గుతుంది

వెల్లికిలా స్ట్రైయిట్ గా చేతులూ స్ట్రైయిట్ గా పెట్టుకుని పడుకుంటే వెన్నుముకకు చాలా మంచిది. ఈ సమయంలో వెన్నుముక న్యాచురల్ పొజిషన్ లో ఉంటుంది. ఇలా పడుకుంటే బ్యాక్ పెయిన్ తగ్గిపోతుంది. కాని ఇలా నిటారుగా పడుకుంటే చర్మంలో త్వరగా వయసు ఛాయలు కనిపిస్తాయట. చెస్ట్ పై ముడతలకూ ఆస్కారమిస్తారని పరిశోధనల్లో బయటపడింది.

Do you have any pain, try these sleep positions,sleeping positions for different types of pains
మెడనొప్పివాళ్లు ఇలా చేయకూడదు..

మెడను తటస్థ భంగిమలో ఉంచాలి. మెడ కింద ఎక్కువ దిండ్లు పెట్టు కోకూడదు. బోర్లా పడుకోకూడదు.

భుజాలు.. చేతులు నొప్పిగా ఉంటే ఇలా వద్దు..

ఓవైపునకు తిరిగి చేతులను అలాగే సైడ్ కి పెట్టుకుని పడుకుంటే వెన్నుముకకు మంచిదే అయినా భుజాలు, చేతులు నొప్పులకు గురవుతాయి. ఇలా ఎడమ లేదా కుడి వైపులకు తిరిగి పడుకోవడంతో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుంది. కుడివైపు తిరిగి పడుకునే ఉంటే హోర్ట్ బర్న్ సమస్యతో పోరాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

మొకాళ్ల నొప్పులు ఉంటే ఇలా వద్దు..

మొకాళ్ల నొప్పులు ఉన్న వారు ముడుచుకొని పడుకోకూడదు. ఏ భంగిమలో పడుకున్నా కాళ్లను స్ట్రైయిట్ గానే ఉంచాలి. బొర్లా తిరిగి పడుకోకూడదు.

Share.

Comments are closed.