దర్శకరత్న దాసరి నారాయణరావు క‌న్నుమూత‌

0
848

Director Dasari Narayana Rao Passes Awayదర్శకరత్న దాసరి నారాయణరావు (75) తుదిశ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న దాసరి హైదరాబాదులోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ సాయంత్రం కన్నుమూశారు.

తెలుగు సినీరంగంలో దిగ్గజ దర్శకునిగా, నటునిగా, రచయితగా ఖ్యాతినార్జించిన దాసరి నారాయణరావు మృతితో టాలీవుడ్ దిగ్భ్రాంతికి గురైంది. కడసారి చూపు కోసం సినీ ప్రముఖులు ఆసుపత్రి వద్ద బారులు తీరారు.ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మే 4, 1942లో జన్మించిన దాసరి తాతా మనుమడు సినిమాతో దర్శకునిగా తెలుగు తెరకు పరిచయమయ్యారు.

ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి సుప్రసిద్ధ నటీనటులకు హిట్ చిత్రాలనందించిన దాసరి రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. రాజ్యసభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా సేవలందించారు.